రేణూ దేశాయ్ లోని  టాలెంట్ ఒక్కోటీ బయటకు వస్తోంది. ఆమె నటన మాత్రమే కాదు, దర్శకురాలు, మంచి కధ రచయిత, ఇపుడు ఆమెలో మరో కోణం కూడా వెలుగు చూస్తోంది. తన మనసులో కలిగిన భావనలకు అక్షర రూపం ఇస్తూ వాటిని పదిమందికీ చేరవేసే వినూత్న కార్యక్రమానికి రేణూ దేశాయ్ ఇపుడు శ్రీకారం చుట్టారు.


కవయిత్రిగా పేరు చెప్పుకోవడం అంటే సిగ్గు అంటున్న రేణూ ఇప్పటికి 250 కి పైగా కవితలు రాశారంటే నమ్మగలమా. ఆమె దాదాపుగా ప్రతీ రోజూ ఏదో రాస్తూనే ఉంటారుట. తన మదిలో మెదిలే ప్రతి ఆలోచననూ కవితగా మారుస్తూ రేణూ వాటిని సాహితీ ప్రియుల ముందుకు తెస్తున్నారు. ఇలా తన ప్రతి అనుభూతిని, అనుభవాన్ని కవితగా అల్లడంలో రేణూ మంచి ప్రావీణ్యం సంపాదించారు.


చిన్నప్పటి నుంచి కవితలను, కధలను బాగా చదవడం అలవాటు అని చెబుతున్న రేణు తనకు 2014లో అనారోగ్యం చేసిందని,అపుడు వచ్చిన ఆలొచనలు కొన్ని కవితగా పెట్టానని, అలా చూస్తూండగానే అవి వందలు అయ్యాయని అంటోంది. తన కవితల వెనక ఉన్న అనుభూతులనే చూడాలి తప్ప దాన్ని తన  పూర్వపు, వర్తమాన జీవితానికి ముడిపెట్టవద్దని రేణూ అంటోంది. 


ఇక రేణూలో మరో కోణం ఏంటంటే ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదువుతారుట. ఈ దేహం సందేహం ఆత్మ మాత్రమే శాశ్వతం అన్న భావన తనను ఎపుడూ వెంటాడుతుందని చెపుతారామే. ఇక తాను సినిమా జీవితంలో ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని అంటున్న రేణూ తనకు రైతుల జీవితాలపై మూవీ తీయాలని ఉందని చెబుతోంది. ఇక్కడో విశేషం ఉంది. రేణూ రాసిన కవితలను మన తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరాం అనువదించడం. అంటే ఆ కవితలు మనమూ చదవవచ్చు అన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: