వరలక్ష్మి ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడే వ్యవహారం కలది . ఈ సారి తన పెళ్లి గురించి మాట్లాడే వారికి ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే వరలక్ష్మీ, హీరో విశాల్ మధ్య అఫైర్, డేటింగ్ అంటూ కొన్ని వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. అయితే మళ్లీ అలాంటి వార్తలు రావడంతో వరలక్ష్మీ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. 

కొందరు పనికిమాలిన వాళ్లు

ఇటీవల సర్కార్ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. విశాల్‌తో స్నేహ బంధం మాత్రమే. మా మధ్య అంతకు మించిన రిలేషన్ గానీ, డేటింగ్ గానీ లేదు. ఇక విశాల్‌ను పెళ్లి చేసుకోనని పదేపదే ఆమె స్పషం చేశారు. అయితే మళ్లీ విశాల్‌తో పెళ్లి అనే వార్త మీడియాలో రావడంతో వరలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలానే ఏడాది ముగింపులో కొందరు పనికి మాలిన వాళ్లు ఏదో హడావిడిగా వార్తను రాయడానికి అవాస్తవాలను మీడియాలో గుప్పించారు. నేను పెళ్లి చేసుకొంటున్నాను అని వార్తా కథనాన్ని వండివార్చారు.

టెలివిజన్ కార్యక్రమంతో

నేను పెళ్లి చేసుకోవడం లేదు అని మరోసారి నేను స్పష్టం చేస్తున్నాను వరలక్ష్మీ ట్వీట్ చేశారు. నేను పెళ్లి చేసుకొని పరిశ్రమను వదిలేస్తానని కొందరు కలలు కంటున్నారు. నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉండి నటిస్తూనే ఉంటాను. అలాంటి చెత్త రాతలు రాసే వారి ముడ్డి మీద తన్నడం ఖాయం. నా స్టేట్‌మెంట్‌తో భంగపడిన వారికి బెటర్ లక్ నెక్ట్స్ టైం. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను ఎవరూ తొక్కేయ్యలేదు అంటూ వరలక్ష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: