నయనతార.. కోలీవుడ్, టాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ హీరోయిన్.. దాదాపు 15 ఏళ్లుగా ఆమె హీరోయిన్ గా అలరిస్తోంది. సాధారణంగా హీరోయిన్‌లకు ఇంత లాంగ్‌ కెరీర్ ఉండదు. ఐదేళ్లు.. మహా అయితే పదేళ్లు.. ఆ తర్వాత క్రమంగా ఫేడ్ అవుట్ అవుతుంటారు.

nayanatara latest pics కోసం చిత్ర ఫలితం


కానీ నయనతార ఇందుకు పూర్తి మినహాయింపు.. హీరోయిన్‌ గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతే కాదు.. టాప్ పెయిడ్ ఆర్టిస్‌ గా కూడా పేరు సంపాదించింది. అటు సీనియర్ హీరోలతోనూ..ఇటు కుర్రహీరోలతోనూ ఆడిపాడుతోంది.

nayanatara latest pics కోసం చిత్ర ఫలితం


ఇటీవల నయనతార వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా ఓ స్థాయికి వచ్చిన హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే క్రమంగా హీరోల పక్కన డాన్సులు వేసే ఆఫర్లు దూరమవుతాయి. కానీ నయనతార మాత్రం అటు హీరోల పక్కన ఆడిపాడూతూనే మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చక్కబెట్టుకుంటోంది.

సంబంధిత చిత్రం


ప్రస్తుతం నయనతార చేతిలో తెలుగు, తమిళం, మళయాళం అన్నీ కలిపి ఏడెనిమిది సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో 2, 3 హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. ఇంకా ఆమెతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలకు కొదువ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: