పాత సంవత్సరానికి వీడ్కొలు చెప్పి కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రపంచ వ్యాప్తంగా జరిగే పార్టీలలో కేక్ ను కట్ చేయడం కొన్నివందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈనాడు ఉదయించే కొత్త సంవత్సరాన్ని అర్దరాత్రి వరకు మేల్కొని స్వాగతించడం ప్రస్తుతం ఒక అలవాటుగా మారిపోయింది. వాస్తవానికి నూతన సంవత్సర వేడుకలు మన భారతీయ సంస్కృతిలో భాగం కాకపోయినా 200 సంవత్సరాలు బ్రిటీష్ పరిపాలనలో మన భారతదేశం కొనసాగిన నేపధ్యంలో బ్రిటీష్ వారి అలవాట్లు అన్నీ మన అలవాట్లుగా మార్చుకున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ నోటిని తీపి చేసుకుంటే ఆ సంవత్సరం అంతా తియ్యగా ఉంటుందని మన అందరి నమ్మకం. 
New Year 2019 Background
అందుకోసమే ఈరోజు ప్రపంచం మొత్తం వారివారి స్థాయిలను బట్టి కేకులను కోసి అందరికీ పంచిపెడతారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈ నూతన సంవత్సర వేడుకలలో ఒకొక్క దేశ ప్రజలకు ఒకొక్క ఆహారపు సెంటిమెంట్ ఉంది. జపాన్ లో బార్లీ లతో చేసిన నూడిల్స్ ను ఒక్క దెబ్బకి ఎక్కడా నవలకుండా ముక్కలు కాకుండా తిన్నవారికి ఆ ఏడాది కాలం అంతా శుభ ఫలితాలు వస్తాయని జపనీయుల నమ్మకం. ఇక గ్రీస్ లో అయితే వాసిలోపిటా అనే నిమ్మ సుగుణాలు ఉన్న కేకులో ఒక నాణెం ఉంచి బేక్ చేస్తారు. అయితే ఆ కేక్ కోసిన తరువాత ఆ నాణెం ఎవరి కేక్ పీస్ లోకి వస్తే వారు అదృష్ట వంతులు అన్న నమ్మకం ఉంది. 
2019 New Year's Eve Blinky Necklace
ఇక స్పెయిన్ లో అయితే నూతన సంవత్సరం రాబోతున్న అర్దరాత్రి 12 గంటల సమయానికి ప్రజలు ఖచ్చితంగా 12 ద్రాక్ష పండ్లు తింటారు. సంవత్సరంలోని 12 నెలలకు గుర్తుగా ఆ పన్నెండు పండ్లు తిన్నవారు అదృష్ట వంతులు అవుతారని అంటారు. అదేవిధంగా దక్షిణ అమెరికాలో అలసందలు మొలకలు ఖచ్చితంగా కేకులతో పాటు కలిపి తింటే అదృష్టం వస్తుందని నమ్మకం. కొరియాలో అయితే బియ్యపు పిండితో చేసిన వంటకాలు జనవరి 1న తిన్నవారికి అదృష్టం వరిస్తుందని కొరియన్ లు విపరీతంగా నమ్ముతారు. అదేవిధంగా డెన్ మార్క్ లో అయితే ఉడికించిన చేపలను ఇటలీలో నానపెట్టిన పప్పు ధాన్యాలను ఈ జనవరి 1న అదృష్టం కోరుకుంటూ తినే సాంప్రదాయం కొనసాగుతోంది. 
Stock vector of 'Happy New Year 2019 Firework'
ఇదే విధంగా మన ఇండియాలో కూడ వివిధ రాష్ట్రాలలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మన సాంప్రదాయానికి అనుగుణంగా రకరకాల పిండివంటలు చేసుకుని ఇంటికి వచ్చిన అతిధులకు ఆ స్వీట్స్ ను తినిపించడం మన సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. ఇలాంటి నేపధ్యంలో ఈరోజు ఉదయించిన కొత్త సంవత్సరానికి సంబంధించిన 365 రోజులకు సంబంధించిన 8760 గంటలు 5,25,600 నిముషాలు 3,15,36,000 సెకన్లు ప్రతి వ్యక్తి జీవితంలోను విజయాలు లభింపచేసి ఆనందాలు కలిగించాలని ఇండియన్ హెరాల్డ్ ఆకాంక్ష..



మరింత సమాచారం తెలుసుకోండి: