2018 చరిత్ర పుటలలో కలిసిపోయి 2019లో అడుగుపెట్టడంతో ఈఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్న  సినిమాలు ఏమిటి అన్నకోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుతున్నాయి. ప్రతి సంవత్సరం  ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఊహించని సూపర్ హిట్స్ వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నా ఈసంవత్సరం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి మాత్రం ఈ నాలుగు సినిమాల పైనే ఉంది. 
 
2019లో ముఖ్యంగా టాలీవుడ్ లో బయోపిక్ ల జాతర జరగబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రెండు భాగాలు మాత్రమే కాకుండా వైఎస్ఆర్ జీవితంపై నిర్మించిన యాత్రతో పాటు ఒకనాటి జానపద హీరో కాంతారావు బయోపిక్ కూడ ఈ ఏడాది రాబోతోంది.  దీనికితోడు ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ మూవీ కూడ ఈఏడాదికి మరో సంచలన సినిమాగా మారబోతోంది. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో లేనిది `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`లో ఉంటుంద‌న్న వార్తలు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి.  వాస్తవానికి‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ లో స్టార్లు లేకపోయినా ఈసినిమాలో ఏముంది అన్న ఆసక్తి అందరిలోను బాగా ఉంది.

అదేవిధంగా ఈఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను ప్రభావితం చేయబోతున్న మరో మూవీ ‘సాహో’ ‘బాహుబ‌లి’ త‌ర‌వాత ప్ర‌భాస్ రేంజ్ ఆకాశాన్నితాకినా నేపధ్యంలో వచ్చే ఏడాది ఆగ‌స్టు 15న విడుద‌ల కాబోతున్న ఈసినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.  200 కోట్ల బ‌డ్జెట్ తో తీస్తున్న ఈమూవీ సక్సస్ ను బట్టి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు ఏర్పడిన క్రేజ్ ఏవిదంగా కలక్షన్స్ రూపంగా మారుతుంది అన్న విషయం పై స్పష్టత రావడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ ఎవరు అన్న విషయం ఈసినిమా విడుదల తరువాత తేలిపోతుంది.

ఇక ఈఏడాది సమ్మర్ రేస్ కు చాలామంది హీరోల సినిమాలు వస్తున్నా మ‌హేష్ నుంచి రాబోతున్న    ‘మ‌హ‌ర్షి’ పై కూడ అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. సామాజికపరమైన అంశం నేప‌థ్యంతో సాగే క‌మ‌ర్షియ‌ల్ మూవీగా తీయబడుతున్న ఈమూవీని వంశీ పైడి పల్లి అద్భుతంగా తీస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక చివరగా చెప్పుకోవలసింది చిరంజీవి ‘సైరా’గురించి. ‘బాహుబ‌లి’ త‌ర‌వాత తెలుగులో ఆస్థాయి సాంకేతిక విలువ‌లు బ‌డ్జెట్‌తో తీర్చిదిద్దుతున్న ఈ సినిమాతో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని చిరంజీవి ప్రయత్నితున్నాడు. వాస్తవానికి ఈసినిమాను 2019 వేస‌విలో ఆతరువాత ఆగ‌స్టు 15కి విడుద‌ల చేద్దామ‌నుకున్న మెగా కాంపౌండ్   పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం లేక‌పోతే ఈఏడాది దసరాకు ఈసినిమాను తీసుకు రావాలని చాలాగట్టిగా ప్రయత్నిస్తోంది. రామ్ చరణ్ జూనియర్ లు ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ లో చిక్కుకోవడంతో వీరిద్దరి సినిమాలు  ఉండవు. అదేవిధంగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ కూడ ఎంతవరకు ఏడాది వస్తుంది అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో 100 కోట్ల కలెక్షన్స్ అంటే సర్వసాధారణం అయిపోయిన పరిస్థితులలో ఈఏడాది విదుదల కాబోతున్న ఈనాలుగు సినిమాలలో ఎదో ఒక్కటి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాస్తుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: