దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పుడు సంగీత ప్రియులకు కిక్కివ్వడం లేదు. వినయ విధేయ రామ లో పాటలు మరీ రొటీన్ గా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అయితే  సినిమాలు ఎలా ఉంటాయన్న సంగతి పక్కన పెడితే దిల్ రాజు సినిమాల్లో మ్యూజిక్ వంక పెట్టే అవకాశం తక్కువగా ఇస్తుంది. అంత దుమ్మెత్తిపోసిన శ్రీనివాస కల్యాణంలో కూడా టైటిల్ సాంగ్ బాగుంటుంది. అయితే దీనికి భిన్నంగా ఎఫ్2లో రొటీన్ పంథాలోనే ట్యూన్స్ ఇవ్వడం విని ఏమైంది దేవి నీకు అని అనుకోని సంగీత ప్రియులు లేరు.

Image result for devi sri prasad

తమన్ లా మూస ట్యూన్స్ ఇస్తున్నాడని కొంత మంది అంటున్నారు. దేవి రంగస్థలం భరత్ అనే నేను తర్వాత ఎందుకో కానీ క్వాలిటీకి చరమగీతం పాడినట్టు ఉంది. హలో గురు ప్రేమ కోసమే సైతం కనీస స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఎఫ్2 కన్నా ముందు వచ్చిన వినయ విధేయ రామ ఆడియో గురించి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం లేదు. చరణ్ డాన్సులను నమ్ముకుని థియేటర్ లో అవే నిలబెడతాయన్న నమ్మకంతో ఉన్నారు.

Image result for devi sri prasad

కానీ దేవి ఇలా చేస్తాడని ఊహించలేదు. ఏదేమైనా దేవిశ్రీప్రసాద్ తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వడం లేదన్నది వాస్తవం. ఒకప్పుడు ఆల్బమ్ మొత్తం రిపీట్ మోడ్ లో పెట్టుకునే పాటలతో ఆకట్టుకున్న దేవి ఇప్పుడు సినిమా మొత్తం ఓ రెండు పాటలు బాగుంటే గొప్ప అనే దాకా వచ్చాడు. ఒకప్పుడు అగ్ర స్థానం అనుభవించి ఆ తర్వాత ఇలాగే మెప్పించలేక కనుమరుగైపోయిన మణిశర్మ-కోటి లాంటి ఉద్దండుల లిస్ట్ లో చేరడానికి దేవికి ఇంకా చాలా టైం ఉంది. మహర్షితో అయినా ఇప్పుడు వచ్చిన రిమార్క్ చెరిగిపోవాలని కోరుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: