అమలా పాల్ పెళ్లి బ్రేక్ అప్ అయిన తరువాత కూడా సినిమా ల్లో బిజీ అయిపొయింది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను పెళ్లాడి సినిమాలు తగ్గించేయడం పెద్ద సర్ప్రైజ్. కానీ కొన్నాళ్లకే అతడి నుంచి విడిపోయి మళ్లీ సినిమాల్లో బిజీ కావడం ఇంకో షాక్. వివాహ బంధం నుంచి బయటకు వచ్చాక అమల మామూలు రచ్చ చేయట్లేదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా గ్లామరస్‌గా ఉంటున్నాయి.

Amala Paul Photos

అలాగే తరచుగా హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లలో కలకలం రేపుతోందామె.తాజాగా పొట్టి నిక్కరు.. తెల్ల చొక్కా వేసి అమల ఒక ఫొటో షూట్లో పాల్గొంది. అందులో మరీ ఎక్స్‌పోజింగ్ ఏమీ చేయలేదు కానీ.. హాట్‌నెస్‌‌కైతే ఢోకా లేదు. సెక్సీ లుక్స్‌తో చంపేస్తోంది అమల. కెరీర్ ఆరంభంలో పల్లెటూరి పాత్రల్లో రూరల్‌ లుక్స్‌తో కనిపించిన అమ్మాయి ఈమేనా అని ఆశ్చర్యపోయేలా ఉంది ఈ ఫొటో షూట్.


ఈ మధ్య అమల ప్రతి లుక్‌లోనూ చాలా మోడర్న్‌గా.. సెక్సీగా కనిపిస్తోంది. మరోవైపు అమల సినీ కెరీర్ ఓ మోస్తరుగా నడుస్తోంది. తమిళం.. మలయాళంలో ఆమెకు ఆఫర్లు బాగానే ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న అమల.. మలయాళంలో ‘ఆడుజీవితం’ అనే స్పెషల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో మాత్రం అమల కెరీర్‌కు ఎప్పుడో బ్రేకులు పడిపోయాయి. చివరగా ఇక్కడ ఆమె ‘జెండా పై కపిరాజు’ చిత్రంలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: