రేణుదేశాయ్ తాను వ్రాసిన ‘ఎ లవ్ అన్ కండీషనల్’ కవితల పుస్తకాన్ని ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ సహకారంతో అనువాదం చేసి విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో గతంలో ముగిసిపోయిన విడాకుల వ్యవహారం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
అందుకే పుస్తకం రాశాను
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై తనకు ఎలాంటి కోపం లేదనీ ఒకవేళ కోపం ఉన్నా ప్రయోజనం లేదనీ పనిమనిషి మీద రోడ్డుపైన కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లలు హోమ్ వర్క్ చేయనప్పుడు వచ్చే కోపం లాంటిదే తనకు పవన్ కళ్యాణ్ పై ఉందనీ అది కేవలం తాత్కాలికం అంటూ విధిరాత ఎలా ఉంటే అలా జరిగిపోతుంది అంటూ తన విడాకుల వ్యవహారం పై షాకింగ్ కామెంట్స్ చేసింది రేణు. అంతేకాదు తాను వ్రాసిన కవితలలో పవన్ ను చూడవద్దనీ తన జీవితంలో తారసపడ్డ కొంతమంది వ్యక్తులలో పవన్ ఒక ప్రముఖ వ్యక్తి మాత్రమే అంటూ రేణు దేశాయ్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 
ఆయన ఒకప్పుడు నా భర్త
ఈకొత్త సంవత్సరంలోని తన నిర్ణయాలు గురించి ప్రకటిస్తూ ఈఏడాది రైతుల సమస్య పై తాను ఒక సినిమాను తీస్తున్నట్లు చెప్పడమే కాకుండా ఆమూవీకి తాను దర్శకత్వం వహిస్తున్నట్లు లీకులు ఇస్తోంది. కేవలం సాహితీ రంగానికి పరిమితం కాకుండా తన మనసుకు నచ్చిన ప్రతి రంగంలోనూ తాను ఈసంవత్సరం అడుగుపెడతాను అంటూ పరోక్షంగా తాను తిరిగి ఫిలిం ఎంట్రీ ఇవ్వబోతున్న విషయానికి సంబంధించిన లీకులు ఇస్తోంది. 
తెలుగులో అనువాదం అందుకే
తాను తన కవిత్వంలో ఏదైనా రొమాంటిక్ పదాలను వాడితే ఆపదాలు పవన్ గురించి ఉద్దేశించినవి అని చాలామంది ఫీల్ అవుతున్నారు అంటూ అన్యాపదేశంగా పవన్ అభిమానులను టార్గెట్ చేస్తోంది రేణు. అయితే తన జీవితంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకుండా మరొక వ్యక్తి ఉన్నాడనీ ఆవిషయాలను పవన్ అభిమానులు అంగీకరిస్తే బాగుంటుంది అంటూ రేణు చేస్తున్న కామెంట్స్ ను పవన్ అభిమానులు అంగీకరించగలుగుతారా అన్నదే ప్రశ్న.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: