ఈ మద్య సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు.  గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు లోక్‌నాథ్‌ (91) మృతి చెందారు.   ఆయనకు ఒక కుమారుడితో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. లోక్‌నాథ్‌ రంగస్థల కళాకారుడిగా అరంగేట్రం చేసి చలన చిత్రరంగంలో తిరుగు లేని క్యారెక్టర్‌ నటుడిగా వ్యవహరించారు.  1927 ఆగస్ట్ 14న జన్మించిన లోక్‌నాథ్‌కు నటన అంటే అమితమైన ఇష్టం.

1000 నాటకాలలో తనదైనశైలిలో నటించి మెప్పుపొందారు.  650కిపైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు.  1970లో ‘సంస్కార’ అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనను ‘ఉప్పినకాయి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. 2016లో నటించిన ‘రే’ ఆయన చివరి సినిమా. ఇంజనీరింగ్‌ చదివిన ఆయన కైలాశంతో కలసి నాటకరంగంలోకి ప్రవేశించారు. గెలీలియో నాటకంలో అత్యంత ఉత్తమ నటుడిగా రాణించి చలనచిత్రరంగంలో ప్రవేశించారు.
veteran kannada actor ch loknath passes away
లోక్‌నాథ్‌ మృతికి కన్నడ సినిమారంగం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీఎం కుమారస్వామి ట్వీట్‌ ద్వారా సంతాపం తెలిపారు. కన్నడ సినిమా రంగానికి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  కాగా, లోక్‌నాథ్ ఇటీవల అంబరీష్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆయనకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. లోక్‌నాథ్ మృతికి శాండల్‌వుడ్ నటులు సంతాపం తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: