బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్‌(81) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కెనడాలో తుదిశ్వాస విడిచారని ఖాదర్‌ ఖాన్‌ కుమారుడు సర్ఫరాజ్‌ వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కెనడాలోనే ఉన్నందున అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.  ఆ మద్య ఖాదర్ ఖాన్ మరణించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఆయన తనయుడు సర్పరాజ్ స్పందిస్తూ..ఇలాంటి రూమర్లు నమ్మవద్దని మీడియా వేధికగా తెలిపారు. ఈ మద్య ఖాదర్ ఖాన్ శ్వాసకోసం సంబంధిత వ్యాదితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..ఆయనకు వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు ఈ మద్య తెలిపారు. 

Image result for ఖాదర్ ఖాన్

డిసెంబర్‌ 31 సాయంత్రం ఆరు గంటలకు మా తండ్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత 16-17 వారాలుగా ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెనడాలోనే అంత్యక్రియలు జరుపుతామని పీటీఐ వార్తా సంస్థతో సర్ఫరాజ్‌ చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రి కోలుకోవాలని అభిమానులు, స్నేహితులు కోరుకున్నారని, వారందరికీ నా ధన్యవాదాలని సర్ఫరాజ్ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌లో కాబూల్‌లో 1937 డిసెంబరు 11న జన్మించిన ఖాదర్‌ ఖాన్, 1973లో రాజేశ్ ఖన్నా హీరోగా వచ్చిన ‘దాగ్‌’చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు.

Veteran Actor, Writer Kader Khan Dies At 81 - Sakshi

అలాగే 250కిపైగా చిత్రాలకు రచయితగా పనిచేసి, సంభాషణలు అందించారు. ఖాదర్‌ ఖాన్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమిత్‌బాబ్‌ బచ్చన్‌ సంతాపం ప్రకటించారు. తన అద్భుత నటనతో వెండి తెరకు మరింత మెరుగులు దిద్దారని మోదీ పేర్కొన్నారు. రచయితగా కూడా గొప్ప సినిమాలు అందించారని కొనియాడారు. ఖాదర్‌ ఖాన్‌ మరణ వార్త కలచివేసిందని అమితాబ్‌ అన్నారు. గొప్ప ప్రతిభావంతుడైన ఆయనను కోల్పోవడం బాధాకరమని ట్వీట్‌ చేశారు. 

Image result for ఖాదర్ ఖాన్

రణధీర్ కపూర్- జయాబచ్చన్ జంటగా వచ్చిన జవానీ దివానీ చిత్రంలోని ఈయన సంభాషణలు అప్పట్లో పాపులర్ అయ్యాయి. ఇక, మన్మోహన్ దేశాయ్, ప్రకాశ్ మెహ్రాలతో ఎక్కువగా పనిచేశారు. వీరి కలయికలో సుహాగ్, పర్వారీశ్, అమర్ అక్బర్ ఆంటోనీ, జ్వాలముఖి, షరాబీ, లవారీస్, మఖ్దర్ కా సికిందర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అమితాబ్‌తో పాటు రాజేశ్‌ ఖన్నా, జితేంద్ర, ఫిరోజ్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, గోవిందా తదితర ప్రముఖ నటులతో ఆయన తెర పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: