మరో ఐదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో వెండితెరపై రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సందడి చేయబోతున్నాయి. ఈ బయోపిక్స్ సందడి ఇటు తెలుగులోనూ.. అటు ఇతర భాషల్లోనూ జోరుగానే ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ తెరపైకి తెస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ జీవిత చరిత్రను యాత్ర పేరుతో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తూ విడుదలకు సిద్దం చేస్తున్నారు.

ntr biopic కోసం చిత్ర ఫలితం


మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో బయోపిక్ రెడీ చేస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. కేసీఆర్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ హీరోగా తెలంగాణ దేవుడు చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు ఉద్యమ సింహం పేరుతో మరో చిత్రం కేసీఆర్ జీవిత చరిత్ర ప్రధానంగా తెరకెక్కుతోంది.

సంబంధిత చిత్రం


అటు జాతీయ స్థాయిలోనూ ఈ బయోపిక్స్ హవా నడుస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రను ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌ గా తెరకెక్కిస్తున్నారు. అంతేనా.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా కూడా రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకదాంట్లో వివేక్ ఒబెరాయ్ హీరోగా నటిస్తున్నారు. మరో చిత్రంలో సీనియర్ నటుడు పరేష్ రావల్ నరేంద్ర మోడీ నటిస్తున్నారు. అటు తమిళనాడులోనూ జయలలిత ప్రధాన పాత్రగా నాలుగైదు బయోపిక్స్ రెడీ అవుతుండటం విశేషం.

MODI BIOPIC కోసం చిత్ర ఫలితం


ఇలా గంపగుత్తగా బయోపిక్స్ వచ్చిపడటం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.. అని పరిశీలిస్తే.. సమాధానం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని సినిమాలు రాజకీయ లక్ష్యాలతోనే నిర్మిస్తుంటే.. మరికొన్ని ఆసక్తికరమైన జీవిత చరిత్రలను ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా తెరపైకి వస్తున్నాయి. తెలుగులో సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర విషయానికి వస్తే.. ఇందులో రాజకీయ లబ్ది కంటే.. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించాలన్న తపనదే పైచేయి. అయితే ఎన్నికల సమయంలో తెరకెక్కుతుండటంతో రాజకీయంగానూ లబ్ది చేకూరే అవకాశం లేకపోలేదు.

ntr biopic కోసం చిత్ర ఫలితం


అదే సమయంలో రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీడీపీకి రాజకీయంగా నష్టం చేకూర్చే ప్రయత్నమన్న విమర్శలు ఉన్నాయి. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌తో వచ్చే లాభం కంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ వల్లే కలిగే నష్టం స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గొప్పదనం గురించే చెబుతారు. అది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం తక్కువ. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రను విలన్ గా చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే స్పష్టమైపోయింది. వెన్నుపోటు పాటే అందుకు ఉదాహరణ.

lakshmis ntr కోసం చిత్ర ఫలితం


ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వెన్నుపోటు అంశం కూడా ప్రజలందరికీ సుపరిచితమే అయినా... ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు ఆ ఎపిసోడ్ గుర్తు చేయడం ఆయన్ను ఇబ్బంది పెట్టేదే అవుతుంది. వెన్నుపోటు ఎపిసోడ్ మరోసారి చర్చకు వస్తుంది. ఐతే.. వెన్నుపోటు ఘటన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయకుడిగా నిలదొక్కుకున్నందువల్ల పెద్దగా జరిగే నష్టం కూడా లేకపోయినా.. అనవసర చర్చకు దారి తీసినట్టవుతుంది.

mandaladeesudu కోసం చిత్ర ఫలితం

పొలిటికల్ బయోపిక్స్ తెలుగు తెరకు కొత్తవేమీ కావు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా ఆయన పాత్రనే విలన్‌ గా పెట్టి నటుడు కృష్ణ మండలాధీశుడు వంటి పలు సినిమాలు తీశారు. కాకపోతే వాటిలో ఎన్టీఆర్ పాత్రను పోలిన పేర్లు పెట్టారు తప్ప జీవిత చరిత్రలుగా తీయలేదు. అయినప్పటికీ అవేమీ ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

tollywood biopics కోసం చిత్ర ఫలితం


ఇక జాతీయ స్థాయి బయోపిక్‌ల విషయానికి వస్తే మన్మోహన్‌ జీవిత చరిత్రగా వస్తున్న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ సినిమా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మన్మోహన్, సోనియాల వ్యవహారశైలి ప్రధానాంశంగా రూపొందుతోంది. ట్రైలర్‌ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే మన్మోహన్‌ను సోనియా కీలుబొమ్మగా ఆడించారన్నది ప్రధాన కథాంశంగా ఉంది. ఐతే.. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని అభ్యర్థి కూడా కాదు.

the accidental prime minister కోసం చిత్ర ఫలితం

ఒకవేళ మన్మోహన్‌ కీలుబొమ్మ అని ఆ సినిమాలో ఎస్టాబ్లిష్‌ చేసినప్పటికీ.. అది పరోక్షంగా రాహుల్ గాంధీకి లాభం చేసేదే అవుతుంది. కీలుబొమ్మలాంటి మన్మోహన్ కంటే రాహుల్ గాంధీ బెటరే కదా అని సగటు ఓటరు భావించే అవకాశం ఉంది. ఇక మోడీ బయోపిక్ విషయానికి వస్తే.. ఇది మోడీకి మేలు చేసినా చేయకపోయినా కీడు చేసే అవకాశం లేదు. ఇది భాజపాకు ఓ కరపత్రం, ఎడ్వర్ట్‌జ్‌మెంట్‌ గా ఉపయోగపడవచ్చు. కానీ మోడీ ప్రభ నానాటికీ తరిగిపోతున్న సమయంలో ఇప్పుడు మోడీ గురించి ఆహో ఓహా అని కీర్తిస్తూ సినిమా తీసినా వర్కవుట్ అవుతందన్న నమ్మకం లేదు.

jayalalitha biopic nitya కోసం చిత్ర ఫలితం

గతంలో ఎందరో నటులు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు వారి పాపులారిటీ కొంతవరకూ ఉపయోగపడుతుందేమో కానీ.. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ వల్లేనే అధికారం సాధించడం కల్ల. అలా జరిగే పనైతే.. అమితాబ్‌ బచ్చన్ వంటి నటుడు ఏనాడో ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అయి ఉండేవాడు. చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే వాడు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. రాజకీయాలపై సినీప్రభావం వేరు. కాబట్టి తామర తంపరగా పుట్టుకొస్తున్న బయోపిక్‌లు ఓటరుపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: