తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్  'బిగ్ బాస్' సీజన్ 1కి  హోస్ట్ గా ఎన్టీఆర్ మెప్పించాడు. 'బిగ్ బాస్ 2'కి హోస్ట్ గా నాని ఆకట్టుకున్నాడు.  కాకపోతే బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం కొద్దిగా కాంట్రవర్సీతో నడిచింది.   సీజన్ 1 లో బిగ్ బాస్ కంటిస్టెంట్ల మద్య ఎలాంటి గొడవలు గిల్లి కజ్జాలు లేకుండా కూల్ గా సాగింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2 లో మాత్రం కౌశల్ ఆర్మీ అంటూ నానా హంగామా చేశారు. 
Image result for bigboss 1 ntr
ఒక రకంగా చెప్పాలంటే ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడానికి కౌశల్ ఆర్మీ ప్రభావం చూపించిందని వార్తలు వచ్చాయి.  అయితే బిగ్ బాస్ సీజన్ 3 కి కొత్త హూస్ట్ రాబోతున్నారని..ప్రస్తుతం ఇండస్ట్రీలో యూత్ వుల్ హీరో విజయ్ దేవరకొండ అంటూ పుకార్లు వచ్చాయి.  కానీ ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విక్టరీ వెంకటేష్ మూడో సీజన్ కి హూస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారట.  ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇటీవలే వెంకటేశ్ తో సంప్రదింపులు జరిపారనేది తాజా సమాచారం.
Related image
ఇక బిగ్ బాస్ సీజన్ 2 యూత్ ని బాగా ఎంట్ర టైన్ చేసిందట. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కార్యక్రమం పట్ల అంతగా ఆసక్తిని చూపడంలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వున్న వెంకటేశ్ ను హోస్ట్ గా రంగంలోకి దింపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట.  అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 2 లో నాని ని ఇంటి సభ్యులు పెద్దగా లెక్కచేయ లేదని విమర్శలు వున్నాయి.
Image result for big boss 2 winner venkatesh
వెంకటేశ్ ను అనుకోవడానికి ఇదొక కారణమని అంటున్నారు. ఇంతవరకూ టీవీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకటేశ్, ఫస్టు టైమ్ ఈ కార్యక్రమం తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: