అందం చూడాలి. ఆనందించాలి, ఆ సంగతి అందగత్తెలకే బాగా తెలుసు ఇక కొత్తగా ఏడాది కొంగ్రొత్తగా బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధాదాస్ బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా క‌నిపించింది. ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ మ‌రింత గ్లామ‌ర్‌తో మెరిసిపోయింది. మెడ‌లో..చేతికి డ్రెస్‌కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ క‌ల‌ర్ బ్యాండ్స్‌ని పెట్టుకుంది. ఈ అందంతో చూసే వాళ్ళను చూపు తిప్పుకోకుండా చేస్తోంది ఈ హాటీ.


అపుడెపుడో తెలుగులో వచ్చిన  సిద్దూ ఫ్రం శ్రీకాకుళం సినిమా గుర్తు ఉందా. అందులో శ్రధ్ధ మెరిసింది. ఆ తరువాత టార్గెట్, డైరీ, డాలింగ్ వంటి మూవీస్ చేసిన శ్రద్ధ హాట్ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. ఆమె డిక్టేటర్ మూవీలో బాలయ్య సరసన కూడా చిందులేసింది. ఇప్పటికి డజన్ వరకూ మూవీస్ చేసినా కూడా శ్రధ్ధాకు పెద్దగా బ్రేక్ అయితే రాలేదు.


అందుకే అనుకుంటా. ఆమె తన అందం ఎక్కడా తగ్గలేదంటూ హాట్ ఫోజులతో వెరైటీ  పిక్స్ పెడుతూ కుర్రకారును వేడెక్కిస్తోంది. బాలీవుడ్లో సినిమాలు చేసినా కూడా ఈ చిన్నది అనుకున్న గోల్ రీచ్ కాలేదనిపిస్తోంది. ఏది ఏమైనా అందం మీద మాత్రం శ్రద్ధ బాగా ఉన్నట్లుంది. ఆమె పిక్స్ అవే చెబుతున్నాయి. తెలుగులో మళ్ళీ ఈ కొత్త ఏడాది ఆమెకు వెల్ కం చెబుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: