తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 లో పదిహేడు మంది ఇంటి సభ్యులు పాల్గొన్నారు.  అందులో చివరి వరకు అన్ని టాస్కులు ఆడుతూ..కెప్టెన్సీ నిర్వహించి అందరి మనసు దోచాడు రోల్ రైడా.  మొదటి నుంచి ఎలాంటి కాంట్ర వర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ..కెప్టెన్సీ టాస్క్ లు కూడా చక్కగా ఆడూతూ చివరి వరకు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగుతూ వచ్చాడు.  కాకపోతే చివరి దశలో మాత్రం కౌశల్ తో కాస్త కాంట్ర వర్సీ వచ్చింది. రోల్ రైడాకి తనిష్, సామ్రాట్ మద్దతు పలకడంతో కౌశల్ ఆర్మికి తీవ్ర ఆగ్రహం వచ్చింది.  దాంతో చివరి మూవ్ మెంట్ లో రోల్ రైడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. 
Image result for bigg boss season 2 telugu final
మొత్తానికి బిగ్ బాస్ 2 సీజన్ పూర్తి అయ్యింది. విన్నర్ గా కౌశల్ నామినేట్ అవడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ని మొదటి నుంచి అందరూ ఒంటరిగా చేస్తూ..ఎన్నో అవమానాలకు గురి చేశారు.  కానీ చివరి వరకు ఆత్మస్థైర్యంతో పోరాడుతూ రావడమే కాదు..రోల్ రైడాకి కూడా కౌశల్ సపోర్ట్ గా నిలిచి మరింత మంది మనసులను దోచుకున్నాడు. ఇక బయటికి వచ్చిన తరువాత డాక్టరేట్ అనీ .. గిన్నీస్ రికార్డ్ అని కౌశల్ ని కొంతమంది తప్పుదారి పట్టించారు.  దీనిపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 
Image result for bigg boss season 2 kaushal roll rida
తాజాగా రోల్ రైడా 'రాదు రాదు' అనే ఒక సాంగ్ ను వదిలాడు. ఆ పాటలో 'ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా ..' అనే లైన్ ఉండటం కౌశల్ మద్దతుదారుల అసహనానికి కారణమైంది. ఇంకేముంది కౌశల్ ఆర్మీ మరోసారి లైన్లోకి వచ్చారట. రోల్ రైడా వీడియోపై డిస్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై రోల్ రైడా స్పందిస్తూ .. "ఈ మధ్య కాలంలో ట్రోల్ అయిన అంశాలపై ఈ సాంగ్ చేశాను .. కౌశల్ ను ట్రోల్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కౌశల్ నాకు టాస్కుల్లో ఎంతో హెల్ప్ చేశాడు. అంతే కాదు బిగ్ బాస్ లో నాకు కౌశల్ ఎంతో హెల్ప్ చేశాడు..మా మద్య మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. కాకపోతే నేను అనుకున్నది ఒకటి .. అయింది ఒకటి .. ఈ విషయాన్ని కౌశల్ ఆర్మీ అర్థం చేసుకోవాలి .. వాళ్లకి సారీ" అని చెప్పుకొచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: