బిగ్ బాస్ వన్ మరియు బిగ్ బాస్ టూ ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పడూ బిగ్ బాస్ 3 కి రంగం సిద్ధం అయ్యింది. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ క్రేజ్ తో ఈ సీజన్ సూపర్ సక్సెస్ గా నిలిచింది. తొలి సీజన్ కు మంచి టిఆర్పి రేటింగులు నమోదయ్యాయి. ఇక రెండవ సీజన్ ని అంతకు మించిన మసాలా అంటూ అంచనాలు పెంచారు. ఏదైనా జరగొచ్చు అంటూ ఊరించారు.

తొలి సీజన్‌కు ఎన్టీఆర్

నాని హోస్ట్ గా బాగా చేశాడు. కానీ బిగ్ బాస్ 2పై మాత్రం కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఇకపై ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బిగ్ బాస్ 3 ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ 3కి హోస్ట్ ఎవరనే విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ చేసే అవకాశం ఉందని, ఎన్టీఆర్ మల్లి రంగంలోకి దిగుతాడని ఊహాగానాలు వినిపించాయి. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. ఇదిలా తాజాగా బిగ్ బాస్ 3 హోస్ట్ విషయంలో సీనియర్ స్టార్ హీరో పేరు వైరల్ అవుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ మేరకు అతడితో చర్చలు జరిపారనేది తాజా సమాచారం. 

ఫ్యామిలీ ఆడియన్స్ అభిమాన హీరో

బిగ్ బాస్ 3 హోస్ట్ గా వినిపిస్తున్న పేరు మరెవరిదో కాదు.. విక్టరీ వెంకటేష్. వెంకీ మీడియా, టివి ఇలాంటి పబ్లిసిటీ అంశాలకు చాలా దూరంగా ఉంటారు. లాంటిది వెంకీ పేరు వినిపిస్తుడడంతో ఆశ్చర్యం వేయక మానదు. కానీ బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన హోస్ట్ అంటే హుందాగా వ్యవహరించాలి. ఆ విషయంలో వెంకటేష్ కు ఎలాంటి మచ్చ లేదు. ఏ సందర్భంలో అయినా కూడా వెంకీ హుందాగానే కనిపిస్తారు. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కు అభిమాన హీరో. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులకు, వెంకీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: