anushka prabhas in kartikeya marriage కోసం చిత్ర ఫలితం

రాజమౌళి కుమారుడు కార్తికేయ వధువు పూజ పెళ్ళిలో వధూవరులలాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుష్క ప్రభాస్ లే. రాజస్థాన్ లో జరిగిన బాహుబలితో టాలీవుడ్ పతాకాన్ని విశ్వ వ్యాపితం చేసిన దర్శక దిగ్గజం రాజమౌళి కొడకు పెళ్ళిలో మన టాలీవుడ్ టాప్ స్టార్స్ చేసిన సందడి మిన్నంటింది. అధికారికంగా "కార్తికేయ వెడ్స్ పూజ" కాని, అక్కడ సందడి మాత్రం ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ రానాలదే. అయితే అక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ మాత్రం, ఖచ్చితంగా అనుష్క అండ్ ప్రభాస్ కాంబినేషన్ అంటే ప్ర-నుష్క అనే చెప్పాలి. 
anushka prabhas in kartikeya marriage కోసం చిత్ర ఫలితం
మా మధ్యన అస్సలు ఏం? లేదు, మేం స్నేహితులం మాత్రమే అంటూ ఈ మధ్యనే తమ స్నేహం గురించి  'కాఫీ విత్ కరణ్‌' లో వెల్లడించారు ప్రభాస్. అలాగే అనుష్క కూడా ప్రభాస్ మాకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమే అని చాలాసార్లు చెప్పాడు. కాని వీళ్ళిద్దరూ పెళ్ళిలో పక్క పక్కనే నిలబడిన తీరును. ప్రవర్తించిన తీరును చూస్తుంటే, ఈ జంట చాలా కాలం క్రితమే పెళ్ళయిన దంపతుల తరహాలోనే కనిపిస్తున్నారు. కుర్తాలో ప్రభాస్ ఒక చక్కని భర్తగా - ఎర్రటి పట్టుచీరలో అనుష్క ఒక ఉన్నత కుటుంబానికి కోడలుగా, బాధ్యత కలిగిన బార్యలాగా కనిపిస్తూ చూపరులకు కనువిందు చేశారు. 
సంబంధిత చిత్రం
అద్భుత నటీ నటులు కాబట్టి - దేవసేన బాహుబలిలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మురిపించిన ఈ జంట ఆ రేంజులో కనిపించారా! లేక నిజంగానే వీళ్ళ మధ్యన "మ్యాటర్ వేగంగా పరిగెత్తుతుందా!" అంటే మాత్రం చెప్పలేమంటున్నారు చిత్రనగర్ వాసులు.  అయితే ఎవరెన్ని చెప్పినా కూడా, వీరిద్దరూ తమ మధ్యన ఉంది "స్నేహమే, స్నేహం మాత్రమే" నని పదేపదే అంటున్నారు. అలాగని ఇద్దరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఏదేమైనా కూడా ఆ పెళ్ళిలో నిజమైన జంట లైన చరణ్‌-ఉపాసన మరియు ఎన్టీఆర్-లక్ష్మీప్రణిత కంటే కూడా వీళ్ళ హంగామా మాత్రమే చూపరులను ఎక్కువగా ఆకట్టుకుంది. పెళ్ళి సంగతి వదిలేస్తే, ఇక ఒక నిజం మాత్రం బయటపడింది ఏమంటే అనుష్క మాత్రం బరువు తగ్గి స్వీటీ మాత్రం కాలేదు. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: