కర్ణాటక సీఎం భార్య ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను తెగ భయపెడుతోంది. సీఎం భార్య  భయపెట్టడమేంటనుకుంటున్నారా.. కర్ణాటక సీఎం కుమార స్వామి రెండో భార్య రాధిక సినిమా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె తాజాగా దమయంతి అనే సినిమాలో నటిస్తున్నారు.

Image result for radhika kumaraswamy in damayanthi


అదిరిపోయే హారర్ కథతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. జోరుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో రాధిక మహా భయంకరంగా ఉంది. ప్రేక్షకులకు దడ పుట్టించేలా ఉంది. మహా కాళి గెటప్ రాధికకు అదిరిపోయింది.

Related image


ఈ చిత్రానికి దర్శకుడు నవరసన్. సాయి కుమార్‌ సోదరుడు రవి శంకర్, రమేష్‌ అరవింద్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమాపై ఈ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెరిగాయి. రాధిక తెలుగు తెరకు అంత కొత్తదేమీ కాదు.

Image result for radhika kumaraswamy in damayanthi


గతంలో ఆమె తారకరత్నతో భద్రాద్రి రాముడు అనే చిత్రంలో నటించారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరర్ మూవీ అవతారంలోనూ రాధిక నటించింది. కానీ తెలుగు తెర ఆమెకు అప్పట్లో అంతగా కలసిరాలేదు. మరి ఈ సినిమాతోనైనా రాధికకు తెలుగు తెరపై సక్సస్ వస్తుందా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: