లిప్‌ లాక్.. కుర్రకారును ధియేటర్లకు రప్పించేందుకు డైరెక్టర్స్‌ చేసే మాజిక్కుల్లో ఇదొకటి. ఇటీవల వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100, 24 కిస్సెస్‌ వంటి సినిమాలు ఇందుకు చక్కటి ఉదాహరణలు. ఈ లిప్ కిస్ సీన్లతో ఒక్కసారిగా ఆయా హీరోయిన్లకూ మంచి క్రేజ్ వస్తుంటుంది.

Image result for tamanna kiss


అబ్బే.. ముద్దు సీన్లంటే మాకు అంతగా ఇష్టం ఉండదు.. కానీ స్టోరీ డిమాండ్ చేస్తే ఏం చేస్తాం అంటూ కొందరు హీరోయిన్లు చిలుక పలుకులు పలుకుతుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం తనకు ఎవరూ లిప్ లాక్ సీన్లు ఇవ్వడం లేదని వాపోతోంది. ఆమే మిల్కీ బ్యూటీ తమన్నా.

Image result for tamanna kiss


ఇప్పటికే అందాల ఆరబోతలో ముందున్న ఈ మిల్కీ బ్యూటీ లిప్ లాక్ సీన్ల విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉందట. ఇప్పటి వరకూ ఏ డైరెక్టరూ తనను లిప్ లాక్ సీన్ల గురించి అడగలేదని చెబుతోంది. అంతే కాదు.. తాను లిప్ లిక్‌ సీన్లకు వ్యతిరేకం కాదంటూ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

Image result for arjun reddy lip lock


తాను ముద్దు సీన్లకు వ్యతిరేకం కాదన్న సంగతి దర్శకులకు ఇప్పటికే చూచాయగా చెప్పాననీ.. కానీ ఎవరూ తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని తమన్నా వివరణ ఇస్తోంది. మరి ఇప్పటికైనా ఏ దర్శకుడైనా ఆమెకు లిప్ లాక్ ఛాన్స్ ఇస్తాడా.. తమన్నా కోరిక తీరుస్తారా.. చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: