టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అనుష్కతో ప్రభాస్ రిలేషన్ ఏంటి అన్నది ఎవరికి అర్ధం కాకున్నా ఆ ఇద్దరికి ముడి పెట్టి ఎప్పటినుండో వార్తలు రాస్తూ వస్తున్నారు. వాళ్లు కూడా ఇలాంటి న్యూస్ విన్నా సరే నవ్వి ఊరుకుంటున్నారు. వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ వారిద్దరిదరు చేసే వ్యవహారాలు చాలా ఉన్నాయి.


రీసెంట్ గా ప్రభాస్, అనుష్కలు ఓ పెళ్లి వేడుకలో ఏకంగా ఆ వేడుక మొత్తం పక్క పక్కనే ఉంటూ అందరికి షాక్ ఇచ్చారు. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో ప్రభాస్ అనుష్కల హంగామా అంతా ఇంతా కాదు. ఓ పక్క టాలీవుడ్ స్టార్స్ అంతా ఆ వేడుకలో కనిపించి అలరించగా ఫోకస్ మొత్తం ప్రభాస్, అనుష్కల మీద పడ్డది.


కొన్నాళ్లుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ప్రభాస్ అండ్ ఫ్యామిలీ మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు. మొన్నామధ్య అమ్మాయి ఫిక్స్ అయ్యింది ఇక ఎనౌన్స్ చేయడమే లేటని అన్నారు. కాని పెళ్లిలో ప్రభాస్ అనుష్కల వ్యవహారం చూసిన వాళ్లెవరైనా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనుకోకమానరు. పెళ్లి టైంలో అలా ఇద్దరు పక్క పక్కనే కనిపించి మీడియాకు మంచి హాట్ టాపిక్ గా మారారు.  


మరి ఇంత మంచి స్నేహం ఉన్న ప్రభాస్ అనుష్కలు ఎందుకు ఒకటి అవ్వకూడదు. హీరోయిన్స్ ను పెళ్లాడటం పెద్ద తప్పేమి కాదు కదా.. టాలీవుడ్ లో కూడా అలాంటివి జరిగాయి మరి ప్రభాస్ ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్ధం కావట్లేదు. ఒకవేళ ప్రభాస్ పెళ్లాడుతా అంటే మాత్రం అనుష్క నో చెప్పే ఛాన్సే లేదని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: