అనసూయ బుల్లితెర షో అయినటువంటి జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే . రంగ స్థలం సినిమా తో సినిమా లలో అవకాశాలు కూడా బాగానే సంపాదిస్తుంది. అయితే న్యూఇయర్ సందర్భంగా అనసూయ తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనసూయను చూడగానే చాలా మందికి ఆమె వేయించుకున్న టాటూ వైపు దృష్టి వెళుతుంది.

ఫస్ట్ రెమ్యూనరేషన్

ఆమె ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారు? దాని అర్థం ఏమిటనే ప్రశ్నలు మైండ్‌లోకి వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికింది. తన ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటి? ఫస్ట్ సాలరీ ఎంత? ఇలా పలు అంశాలపై ఆమె స్పందించారు. మీరు వేయించుకున్న టాటూ అర్థం ఏమిటి? అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ.... ఆ టాటూ అర్థం ‘నిక్కూ', అది మా ఆయన పెట్ నేమ్ అని తెలిపారు. 

టాటూ అర్థం అదే

యాక్టింగ్, యాంకరింగ్ కాకుండా.... మీలో ఉన్న ఇతర టాలెంట్స్ ఏమిటి? అంటే బాగా పాటలు పాడతానని, వంట బాగా చేస్తానని అనసూయ చెప్పుకొచ్చారు. మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే ప్రశ్నకు అనసూయ రిప్లై ఇస్తూ .. రూ. 5,500 అని తెలిపారు. వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర'లో మీ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను అనసూయ దాటవేశారు. ఆ విషయం నేను ఇప్పుడే చెప్పలేను. కానీ నా జీవితంలో గుర్తుండిపోయే పాత్ర అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: