దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు 5 ఏళ్ళు పట్టిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి ప్రభాస్ విభిన్నంగా స్పందించాడు. ఒక చిత్రం కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించడం ఎవరివల్లా కాదు. కానీ రాజమౌళితో ఏదో సాధించాలనే తపన ఉంది. రాజమౌళిని నమ్మే హీరోల విషయానికి వస్తే మాత్రం పిచ్చోళ్లనే అంటాను. ఎందుకంటే రాజమౌళిని నమ్మేది పిచ్చోళ్లు మాత్రమే. ఈరోజుల్లో ఒక చిత్రానికి ఐదేళ్లు కేటాయించడం చాలా కష్టం అని రాజమౌళి తెలిపాడు. 

ముసలోళ్ళు అయిపోతాం

ఒక్కో చిత్రణకి నాలుగేళ్లు, ఐదేళ్లు కేటాయించుకుంటూ పోతే 4 సినిమాలు చేసే సరికి ముసలోళ్ళు అయిపోతాం అని ప్రభాస్ తెలిపాడు. దర్శకులుగా, నిర్మాతలుగా 80 ఏళ్ల వయసులో కూడా పనిచేయవచ్చు. కానీ హీరోగా, హీరోయిన్ గా నటించాలంటే మాత్రం వయసులోనే అని ప్రభాస్ తెలిపాడు. ఐదేళ్ల పాటు తెరకెక్కించినంత మాత్రాన ఆ సినిమా పరిస్థితి ఏంటో చెప్పలేం. కానీ బాహుబలికి అది వర్కౌట్ అయిందని ప్రభాస్ తెలిపాడు. 

బాగా తెలిసొచ్చిందా

బాహుబలి చిత్రం అనే ప్రపంచంలో ప్రభాస్ దాదాపు ఐదేళ్ల పాటు గడిపాడు. దీనితో ప్రభాస్ కు బాగా తెలిసొచ్చినట్లు ఉంది. ఇక రాజమౌళి కూడా సినిమాల విషయంలో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి నుంచి తదుపరి వచ్చే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏడాదిన్నర లోపే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో బాహుబలి లాంటి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం అదే తొలిసారి. ఇప్పుడు రాజమౌళికి ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి అనుభవం ఉపయోగపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: