టాప్ హీరోలతో సినిమాలు తీయడం దిల్ రాజ్ కు ఉన్న అలవాటు. గత కొంతకాలంగా దిల్ రాజ్ కు టాప్ హీరోలతో తీసిన సినిమాల విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా దిల్ రాజ్ కు టాప్ హీరోల పై మోజు తగ్గలేదు అన్న విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. 
కళ్ళు చెదిరేలా యాక్షన్
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం కలక్షన్స్ ను షేక్ చేస్తున్న ‘కె.జి.ఎఫ్’ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈమూవీ కథలోని హీరో పాత్ర రీత్యా ఆకథకు ప్రభాస్ అన్ని విధాల సరిపోతాడని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావించడంతో దిల్ రాజ్ ఈవిషయమై ప్రభాస్ ను కలిసినట్లు సమాచారం. 
షాకింగ్ ట్విస్ట్
ప్రభాస్ సూచనమేరకు ఇప్పటికే ప్రశాంత్ నీల్ అతడిని కలవడం ఆకథను వివరించడం జరిగింది అని అంటున్నారు. ఆకథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో ఈమూవీ ప్రాజెక్ట్ కు ప్రభాస్ సూత్ర ప్రాయంగా అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నేపధ్యంలో ఈమూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. 
రజనీకాంత్ సినిమాల్లో
గత నెల విడుదలైన ‘కె.జి.ఎఫ్’ కలక్షన్స్ విషయంలో తన సంచలనాలు కొనసాగిస్తూ ఇప్పటికే 100 కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటి 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో ఈసినిమాకు సంబంధించిన మ్యానియా కొనసాగుతున్న పరిస్థుతులలో సంక్రాంతి సినిమాల హడావిడి మొదలు అయ్యే వరకు ‘కె.జి.ఎఫ్’ హంగామా కొనసాగే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: