ఈ సంవత్సరం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ సినిమా తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పెట్టా’సినిమాలో నటిస్తున్నారు రజినీకాంత్. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్, లిరిక్స్, టీజర్ తో పాటు తమిళ వర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.  నూతన సంవత్సరం కానుకగా తెలుగు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.  తాజగా 'పేట' తెలుగు ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిక్, విజయ్ సేతుపతి, శశికుమార్, త్రిష, సిమ్రన్ లు నటించిన సంగతి తెలిసిందే.


ఈ ట్రైలర్ లో 20 మందిని పంపించాను... అందరినీ చితక్కొట్టి పంపించాడు" అన్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆపై 'కాళీ' పరిచయం, 'వీడు మామూలోడు కాదు మహీ' అన్న డైలాగులతో పాటు రజనీ తనదైన స్టయిల్ లో "హహాహా... చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట" అన్న డైలాగ్, ఫైట్ సీన్, సిమ్రన్ తో రోమాన్స్, త్రిషల పరిచయం ఉన్నాయి. "చూడటానికి చిన్న పిల్లాడిలా చాలా స్టయిల్ గా ఉన్నారు" అని ఓ అమ్మాయి అనగా, "స్టయిల్ గా ఉన్నానంట... నాచురల్లీ" రజినీ కొట్టే డైలాగ్స్ ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి.


"అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తావు" అనే డైలాగ్, "వీడు చావాలి జిత్తూ" అన్న నవాజుద్దీన్ డైలాగ్, "ఏయ్... నిజం చెబుతున్నాను... కొట్టి అండర్ వేర్ తో పరిగెత్తిస్తాను. పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో" అని రౌడీలతో రజనీ అనే డైలాగ్ అలరిస్తుంది. "ఎవరికైనా పెళ్లాం పిల్లలు అన్న సెంటిమెంట్, గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతోంది ఇక్కడ. దొరికారా భస్మమే" అన్న ఇంకో డైలాగ్ కూడా ఉంది...అంటూ సాగుతున్న ఈ ట్రైలర్ లో రజినీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.  అహ్లాదంగా సాగే ఓ క్యారెక్టర్ అయితే..మాఫియా డాన్ గా మరో క్యారెక్టర్ తో రజినీ అభిమానులను మరో భాషా లెవెల్లో మెప్పించబోతున్నట్లు అర్థం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: