వరస హిట్లతో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు. చాలమంది హీరోలు అతడి దర్సకత్వంలో నటించాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా కొరటాల తనకు నచ్చిన హీరోలతో మాత్రమే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
పక్కా ప్లానింగుతో సూపర్ హిట్లు కొడుతున్న కొరటాల శివ
ఇలాంటి పరిస్థితులలో ఫోర్బ్స్ ప్రతిక ప్రకటించిన వివరాల ప్రకారం సంపాదనలో గతేడాది కొరటాల శివ పెద్దపెద్ద దర్శకులను సైతం మించిపోయాడు అని ప్రకటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇది ఇలా ఉండగా కొరటాల శివ తాను సినిమాల ద్వారా సంపాధించిన భారీ మొత్తాలను తిరిగి ఇండస్ట్రీలోనే పెట్టుబడి పెడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
వరుస బ్లాక్‌బస్టర్స్
వాస్తవానికి కొరటాల చిరంజీవితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఈ సినిమాకు సంబంధించిన కథ కూడ ఫైనల్ అయింది. అయితే రకరకాల కారణాలతో ఈసినిమా సెట్స్ పైకి దీనితో ఈ ఆలస్యాన్ని మరో విధంగా సద్వినియోగం చేసుకోవడానికి కొరటాల తన సొంత నిర్మాణ సంస్థ పై ఒకచిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఈనెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. 
సమయం వృధా చేయకుండా....
ఈ సినిమాలో అందరు కొత్త నటీనటులు నటించ బోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలో నటించే కొత్త నటుల అన్వేషణను కూడా కొరటాల పుతి చేసినట్లు సమాచారం.  గతంలో దాసరినారాయణ రావు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు చిన్న సినిమాలు చేస్తూ చరిత్ర  సృష్టించారు. ఇప్పుడు కొరటాల శివ కూడ అదే విధానాన్ని అనుసరిస్తున్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: