సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా పేట. 2.ఓ తర్వాత రజిని చేస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 10న తమిళంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్ ఉండేది. కాని ఈరోజు తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.   


అసలే సంక్రాంతి ఆపైన మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైంలో రజిని పేట కూడా సంక్రాంతికి వస్తుంది. పేట తెలుగులో కూడా జనవరి 10న రిలీజ్ అవుతుంది. అయితే రజిని సినిమా అంటే తెలుగులో సూపర్ క్రేజ్ ఉంటుంది. కాని ఈమధ్య రజిని స్టామినాకు తగిన సినిమాలు రాకపోయేసరికి ఇక్కడ కొద్దిగా క్రేజ్ తగ్గిందని చెప్పాలి.


ఒకప్పుడు రజిని సినిమా అంటే మన దగ్గర చిన్నా చితకా సినిమాలు భయపడే పరిస్థితి ఉండేది. కాని లింగా, కబాలి, కాలా, ఆఖరికి భారీ అంచనాలతో వచ్చిన 2.ఓ కూడా అంచనాలను అందుకోకపోయే సరికి రజిని ప్రస్తుతం సినిమా పేటకి పెద్దగా బజ్ ఏర్పడలేదు. అందుకే పేట తెలుగు బిజినెస్ కూడా కేవలం 12 కోట్లే అయ్యిందట.


రజిని లాంటి స్టార్ హీరోకి తెలుగులో అంత తక్కువ మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. ఈ సంక్రాంతికి ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు, రాం చరణ్ వీయ విధేయ రామ, వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్-2 సినిమాలు వస్తున్నాయి. వాటికి పోటీగా పేట కూడా వస్తుంది. మరి ఈ పేట పవర్ ఎంతో తెలియాలంటే మరో ఎనిమిది రోజులు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: