నందమూరి అందగాడు బాలయ్యకు సినిమాయే జీవితం, సినిమాయే ఊపిరి. ఇతర హీరోల మాదిరిగా అయానకు వేరే బిజినెస్ లు లేవు. ఆ వూసు, ధ్యాసా కూడా అయనకు లేదు. ఇక అందరిలాగా ఆయన టీవీ యాడ్స్ చేయడం, లేక వేరే వ్యాపకాలలో మునిగితేలడం అసలు చేయరు. ఒక సినిమా తరువాత మరో సినిమా ఇలా లైన్లో పెట్టడంలో బాలయ్య తరువాతనే ఎవరైనా. కధానాయకుడు, మహానాయ‌కుడు తరువాత బాలయ్య బోయపాటి మూవీ కంఫర్మ్ చేసేశాడు. ఇపుడు ఆ పనుల్లో మన బాలయ్య తీరిక లేకుండా ఉన్నారట.


కధానాయకుడులో అనేక గెటప్పులలో కనిపించిన బాలయ్య దాంతొ బరువు కూడా కొన్ని సార్లు పెరగాల్సివచ్చిందట. ఇక బోయపాటి మూవీకోసం బాలయ్యను బాగా తగ్గమన్నాడట. దాంతో బాలయ్య ఇపుదు కసరత్తులు చేసి మరీ తన బరువుని పాతిక కిలోలు తగ్గేందుకు రెడీ అయిపోతున్నారట. కధ ప్రకారం బాల‌య్యకు యంగ్ లుక్ అవసరం. అందువల్ల బాలయ్య బాగా సన్నపడి ఇప్పటి హీరోలకు పోటీ ఇచ్చేందుకు తయారవుతున్నారుట.


ఇక ఈ సినిమా తరువాత కూడా బాలయ్య వేరే డైరెక్టర్లతో కమిట్ అవుతున్నారట. ఎఫ్ 2 మూవీ తీసి ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న అనిల్ రావిపూడి మూవీని బోయపాటి తరువత బాలయ్య చేయబోతున్నారట. ఆ తరువాత కొరటాల శివ మూవీలో కూడా చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఇప్పటికే వంద సిన్మాలు పూర్తి చేసిన బాలయ్య తన జోరుని ఎక్కడా అపాడం లేదు. మరెక్కడా తగ్గడంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: