పెళ్లయిన తర్వాత పెళ్లాం తన చుట్టూ మొగుడు చక్కర్లు కొట్టేలా జాణతనం ప్రదర్శిస్తే.. అమ్మో.. అప్పుడే మొగుడ్ని కొంగుకు కట్టేసుకుంది అని అనడం సహజమే. కానీ ముదురు హీరోయిన్ నయనతార విషయం ఇందుకు రివర్స్.. ఈ ముదురు ముద్దుగుమ్మ పెళ్లి కాక ముందే లవర్‌ను కొంగుకు కట్టేసుకుంటోందట.

Related image


15 ఏళ్ల సినీ కెరియర్ ఉన్న నయనతార.. ఇంకా తన హవా కొనసాగిస్తోంది. చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంటోంది. ఈ అమ్మడు మూడేళ్లుగా డైరెక్టర్ విఘ్నేశ్‌తో లవ్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట ఇప్పుడప్పుడే పెళ్లాడేలా కనిపించడం లేదు.

Image result for nayanthara vignesh


ఐతే.. డైరెక్టర్ విఘ్నేశ్‌ కు మాత్రం చేతిలో పెద్దగా సినిమాల్లేవు. ఇటు చూస్తే నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందుకే విఘ్నేశ్ నయన తార వెంట షూటింగులకు హాజరవుతూ కాలం గడుపుతున్నాడట.

Image result for nayanthara vignesh


ఎలాగూ తాను చేతినిండా సంపాదిస్తోంది కనుక.. కాబోయే మొగుడి తన చుట్టూ తిరిగితే చాలనుకుంటోందట నయనతార. అందుకే విఘ్నేశ్ చేతిలో సినిమాలు లేకపోయినా పెద్దగా ఫీల్ కావడం లేదట. ప్రియుడినే బాడీగార్డ్ గా మలచుకుందన్నమాట ఈ నెరజాణ.


మరింత సమాచారం తెలుసుకోండి: