కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. కన్నడ సినిమానే అయినా తెలుగు, తమిళ, హింది భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. కె.జి.ఎఫ్ అన్నిచోట్ల సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా హిందిలో షారుఖ్ జీరోని దాటేసింది అంటే యశ్ సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.


ఇక ఈ సినిమాను తెలుగులో వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని తీసుకొచ్చి సినిమాను ప్రమోట్ చేశారు. కె.జి.ఎఫ్ కు పోటీగా రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. అవి ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయితే కె.జి.ఎఫ్ మాత్రం తెలుగులో ఇప్పటికే 10 కోట్లు పైగా వసూళు చేసింది.


అసలు తెలుగు వాళ్లకు ఏమాత్రం పరిచయం లేకున్నా సరే సినిమా హిట్ చేసినందుకు యశ్ తెలుగు వాళ్లు గొప్పోళ్లంటూ పొగిడాడు. ఇక యశ్ తెలుగులో ఏర్పడిన క్రేజ్ చూసి ఓ స్ట్రైట్ సినిమా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట సాయి కొర్రపాటి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను ఇప్పటికే కథ సిద్ధం చేయమని చెప్పాడట. 


కె.జి.ఎఫ్ సినిమా చూస్తే హీరో సెంట్రిక్ ఇమేజ్ తో రాజమౌళి చేసిన ఛత్రపతి సినిమా గుర్తుకొస్తుంది. అలాంటి సబ్జెక్ట్ తోనే యశ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. డైరక్టర్ ఎవరన్నది ఇంకా తెలియదు కాని యశ్ డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రం కన్ ఫాం అయినట్టే. మరి యశ్ తెలుగు డైరెక్ట్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: