బాలీవుడ్ అందాల బ్యూటీ కత్రినా కైఫ్ ఇంకా తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూనే ఉంది.  రీసెంట్ గా రీలీజ్ అయిన ‘జీరో’చిత్రంలో షారూఖ్ సరసన నటించిన కత్రినా కైఫ్‌ హాట్ లుక్స్ తో కనిపించింది.  గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ‘మల్లీశ్వరి’చిత్రంలో నటించిన కత్రినా తర్వాత తెలుగులో కనిపించలేదు.  బాలీవుడ్ లో ఈ అమ్మడిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి.  ఇక ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంటే ఎంతో సంబంరంగా చేసుకుంటారు. 
Image result for katrina kaif swimming english channel
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రక రకాలుగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు.  కానీ ఈసారి మాత్రం కత్రినా చాలా వెరైటీగా న్యూఇయర్ వేడుకలు జరుపుకుంది. అసలే ఇప్పుడు చలికాలం..బయటకు వెళ్లాలంటే ఎంతో భయం వేస్తుంది..రగ్గులు, స్వెట్లరు రక రకాల వస్త్రాలు ధరించి బయటకు వెళ్తున్నారు.  కానీ కత్రీనా కైఫ్ మాత్రం వెరైటీగా ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ చానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది.
Image result for katrina kaif swimming english channel
ఈ సమయంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ లో ఈదేందుకు సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు. ఇక ఇక్కడి నీటిలో తన తల్లి, సోదరితో కలిసి ఈతకొట్టిన కత్రినా, ఈ వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అభిమానులతో షేర్ చేసుకుంది.  కాకపోతే ఇలాంటి సాహసాలు చేసే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకోవాలని..పూర్తి రక్షణ ఉంటేనే ఇలాంటి పని చేయాలని సలహా ఇస్తుంది. వరినీ కించపరచవద్దని, శరీరాన్ని, మనసును ఒకే చోట ఉంచాలని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది.  తాజాగా ఈ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: