ఎన్టీఆర్ బయోపిక్ కోసం విపరీతంగా కష్టపడిన బాలకృష్ణ ఈసినిమాకు సంబంధించిన రెండు భాగాలు విడుదలై వాటి రిజల్ట్ రాకుండానే బోయపాటి శ్రీను మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈఏడాది ఫిబ్రవరిలో తన మరో యాక్షన్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. వచ్చే ఏప్రియల్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నా ఆవిషయాల పై దృష్టి పెడుతూనే బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేయడంతో బాలయ్య స్పీడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన నేపధ్యంలో ఉండే ఈమూవీ కథ బాలయ్య స్టైల్ కు తగినవిధంగా రూపొందించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈమూవీని ఈఏడాది దసరాకు విడుదల చేయాలి అన్న ఆలోచలనలో ఉన్నట్లుతెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గాకొనసాగుతోంది. 
'Legend' Review: Balayya Does Not Disappoint
ఈసినిమాకు సంబంధించిన పాత్రలో బాలయ్య లుక్ డిఫెరెంట్ గా కనిపించడానికి బోయపాటి బాలకృష్ణను 25 కేజీల వరకు బరువు తగ్గమని కోరినట్లు టాక్. ప్రస్తుతం 59 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలకృష్ణ ఒకేసారి 25 కేజీల బరువు తగ్గాలి అంటే డైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
'Paisa Vasool' Review: Chaala Theda!
అయితే ఈ విషయమై ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా బాలయ్య బోయ పాటి చెప్పిన కండిషన్స్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో బోయపాటి ఈసినిమాలో హీరోయిన్ గా బాలయ్య పక్కన రకుల్ ప్రీత్ ని కానీ లేదా కియారా అద్వానీని కానీ ఎంపిక చేసే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం బోయపాటి బాలయ్యల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈమూవీ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని బోయపాటి ఇప్పటికే ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: