ఈ సంవత్సరం సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘వినయ విధేయ రామ’ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ లో చరణ్ తన ఒంటి పై టాటూ లతో అదిరిపోయే ర్యాంబో లుక్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ లుక్ వెనుక దాగి ఉన్న డైటింగ్ సీక్రెట్ ను ఉపాసన బయటపెట్టింది. 
రామ్ చరణ్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు?
అంతేకాదు ఇలాంటి డైట్ చరణ్ అభిమానులు తీసుకుంటే వారు కూడ రామ్ చరణ్ లుక్ లోకి మారిపోవచ్చు అంటూ సలహాలు ఇస్తోంది. చరణ్ మాదిరిగా శరీరాన్ని ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హార్డ్ వర్క్ డెడికేషన్ డిసిప్లేన్ తో పాటు చరణ్ క్రమం తప్పకుండా తీసుకున్న డైట్ కూడ చాల అవసరం అని అంటోంది ఉపాసన. 
హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లేన్
‘వినయ విధేయ రామ’ లోని లుక్ కోసం చరణ్ ప్రతిరోజు ఉదయం 8 గంటలకు 3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, 3/4 కప్ ఓట్ మీల్ విత్ ఆల్మండ్ మిల్క్ ఉదయం: 11.30 గంటకు ఒక పెద్ద కప్పు కూరగాయల సూప్. మధ్నాహ్నం 1.30 గంటలకు 200 చికెన్ బ్రెస్ట్, 3/4 బ్రౌన్ రైస్, 1/2 గ్రీన్ వెజిటబుల్ కర్రీ సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, 1/2 కప్ గ్రీన్ వెజిటబుల్ సాయంత్రం 6 గంటలకు: గ్రీన్ సలాడ్, అవాకాడో, నట్స్ తీసుకోవాలి అని అంటోంది ఉపాసన. ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉదియార్ నేతృత్వంలో చరణ్ చాల క్రమ పద్ధతిలో ఈ డైటింగ్ తీసుకున్న విషయాన్ని బయటపెట్టింది ఉపాసన. 
ఏవి తినాలి? వేటికి దూరంగా ఉండాలి
గతంలో ‘బాహుబలి’ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న డైట్ అప్పట్లో మీడియాకు హాట్ టాపిక్. ఒకేసారి ఉదయం పూట 22 కోడిగుడ్లు తినడం తనకు టార్చర్ గా మారింది అంటూ అప్పట్లో ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు చరణ్ కూడ ప్రభాస్ లాగే కండలు పెంచి కనిపించడానికి పడిన కష్టానికి ‘వినయ విధేయ రామ’ విషయంలో అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: