ఈరోజుసాయంత్రం అవుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ సర్టిఫికేట్ కు సంబంధించి ఏర్పడిన సమస్యలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ క్లియరెన్స్ కు ఆయన భార్య లక్షీ పార్వతి నుండి కూడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సెన్సార్ అధికారులు అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
NTR Biopic New Poster Legendary NTR as British Inspector
వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ మొదటి బాగానికి చెందిన ‘కథానాయకుడు’ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్ర ఉండదు. ఈమూవీ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అని ఆలోచనలు చేస్తున్న సందర్భంలో ముగింపుకు వస్తుంది అని తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జీవించి ఉన్నారు కాబట్టి ఆమె దగ్గర నుండి కూడ ఈ బయోపిక్ కు సంబంధించి ఎన్ఒసి కావాలి అని సెన్సార్ అధికారులు దర్శకుడు క్రిష్ ను అడిగినట్లు సమాచారం. 
Savitri First Look At NTR Biopic
దీనితో షాక్ కు గురైన క్రిష్ లక్ష్మీ పార్వతి నుంచి రావలసిన ఎన్ఒసీ విషయంలో ఏర్పడ్డ అడ్డంకులను ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీ పార్వతి తన పాత్ర ‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ సినిమాలలో లేకపోయినా రామారావు భార్యగా ఆసినిమాకు సంబంధించిన అన్ని విషయాలకు తన అంగీకారం కూడా కావాలి అని సెన్సార్ బోర్డ్ అధికారులను కోరినట్లు టాక్. 
Balakrishna as NTR
ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్ కు సెన్సార్ క్లియరెన్స్ లభించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈ సాయంత్రానికి ఈవిషయమై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: