టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటవారసుడిగా ‘ఈశ్వర్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి, బాహుబలి2’చిత్రాలతో ఏకంగా జాతీయ, అంతర్జాతీయ నటుడిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా వస్తున్న ప్రభాస్ తాజాగా  గెస్ట్ హౌజ్ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ప్ర‌భాస్ గెస్ట్ హౌజ్ కేస్ నానా మ‌లుపులు తిరుగుతుంది. ఎప్పుడూ వివాదాల్లో లేని ప్ర‌భాస్ తొలిసారి చాలా పెద్ద భూ వివాదంలో ఇరుక్కున్నాడు. ఎలాగైనా త‌న గెస్ట్ హౌజ్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ భూవివాదంపై ప్ర‌భాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు జ‌న‌వ‌రి 3కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ కేసు విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రీల్ లైఫ్ లో ఎంతో మంది విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్ లో విలన్లతో తలపడి ఉండరన్న న్యాయస్థానం.  సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమన్న హైకోర్ట్... ప్రభాస్ విషయంలో మాత్రం ఆచీ..తూచీ వ్యవహరించామన్నా తెలిపింది. 
Image result for prabhas
ప్రభాస్ భూ కబ్జాదారుడు అన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన హైకోర్టు...  ప్రభాస్ కి అనుకూలంగా తీర్పు ఇస్తే..ఆ భూమిని కబ్జా చేసిన వాళ్లూ అర్హులవుతారన్న ప్రభుత్వ లాయర్. కాగా, భూమి విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌజ్ కట్టుకున్నారని తెలిపారు ప్రభాస్ లాయర్. ఇరు వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. 


మరింత సమాచారం తెలుసుకోండి: