కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఇటీవల కేజీయఫ్ సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  దాంతో ఈ కన్నడ హీరోపై తెలుగు దర్శక, నిర్మాతల చూపు పడింది.  కన్నడంలో దాదాపు పదిహేనుకు పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు యష్.  అయితే ఎంత హీరో అయినా రియల్ లైఫ్ లో ఇబ్బందులు ఉండటం సహజం. అయితే యష్ కి ఆర్థిక ఇబ్బంది లేకున్నా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన షాక్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. 
Related image
ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమానులకు అద్దె చెల్లించి వెంటనే ఖాళీ చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.  ఇంటి మరమ్మతుల కోసం తాము పెట్టిన ఖర్చును బాడుగగా పరిగణించాలన్న యశ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే..బనశంకరి మూడవస్టేజీలోని ఆరవ బ్లాక్‌లో నెలకు రూ.40 వేలు చెల్లిస్తూ యశ్‌ కుటుంబం అద్దెకు ఉంటోంది. కాగా, 2015లో ఈ ఇంటిని ఖాళీ చేయాలని యజమానులైన మునిప్రసాద్, వనజా దంపతులు కోరారు. అయితే ఇందుకు యశ్ తల్లి పుష్ప అంగీకరించలేదు. 
Image result for yash family photo
తాము ఇంటిలో అద్దెకు ఉంటున్నప్పటికీ..ఆ ఇంటికి కొన్ని మరమ్మత్తులు చేయించామని..దాని ఖర్చు రూ.12.50 లక్షలు ఖర్చు పెట్టామని వాదిస్తున్నారు. అయితే తమ కిరాయి  మరమ్మత్తు చేయించిన వాటిలో జమ కట్టుకోమని యష్ తల్లి కోరారు. అయితే ఇందుకు ఇంటి యజమానులు  అంగీకరించకపోవడంతో ఆమె బెంగళూరు సివిల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ యజమానులకు అనుకూలంగా తీర్పు రావడంతో హైకోర్టుకు వెళ్లారు. తాజాగా అక్కడ కూడా పుష్పకు చుక్కెదురు అయింది.
Image result for yash kgf
ఇంటి యజమానులకు బాకీ పడ్డ రూ.23 లక్షల అద్దెను 2019, మార్చి 31లోగా చెల్లించి, ఇంటిని ఖాళీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, సినీ ఇండస్ట్రీలో తన కుమారుడిపై కొంత మంది వ్యక్తిగత్ కక్ష్య పూనుకుంటున్నారని..అందులో భాగమే అద్దె ఇంటి విషయం అని..వాళ్లు  దిగజారుతారని అనుకోలేదన్నారు యష్ తల్లి పుష్ప. 


మరింత సమాచారం తెలుసుకోండి: