ప్రస్తుతం తెలుగులో బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ ‘ఎన్టీఆర్’ బయోపిక్.   ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న… రెండో భాగం ‘మహానాయకుడు‘ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి.  ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి.  ఈ సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. 
Image result for seaira narasimha reddy
బాలకృష్ణకు ఎంతో సెంటిమెంట్ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘కథానాయకుడు‘ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయని తెలుస్తుంది.  ఓ ప్రముఖ డిజిటల్ ఛానల్ ఎన్టీఆర్ కథానాయకుడు టిజిటల్ రైట్స్ రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.  ఇంకా రెండో భాగం ‘మహానాయకుడు’ డిజిటల్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉంది. అలానే థియేట్రికల్ రైట్స్ కూడా ఈ సినిమాకు కాసుల వర్షం పండిస్తోంది.
Image result for NTR BIOPIC
వరల్డ్ వైడ్ గా రూ.72 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్మడయ్యాయి. ఇప్పుడు ఈ డిజిటల్ రైట్స్ తో కలిపి 100 కోట్లకు చేరువైంది.  ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’పోస్టర్స్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా నిర్మాత రాంచరణ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్నారు.
Image result for NTR BIOPIC
అయితే సైరా సినిమా హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయాయి.  ఈ లెక్కన చూసుకుంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాల కోసం పెట్టిన బడ్జెట్ లో అప్పుడే చాలావరకు రీకవర్ అయ్యినట్లే అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు బాలకృష్ణ కూడా నిర్మాతల్లో ఒకరు. మొదటి భాగానికే ఇంతలా క్రేజ్ ఉంటే ఇంకా రెండో భాగం పరిస్థితి ఏంటో వేరే చెప్పనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: