నిన్న విడుదలైన అఖిల్ టీజర్ లో వచ్చే డైలాగ్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు అంతా నా ఒక్కడి కోసమే పుట్టలేదు. వాళ్ళకీ ఒక లైఫ్ ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తాను’ అంటూ ఈమూవీకి సంబంధించిన టీజర్ లో వచ్చిన డైలాగ్ వినడానికి బాగానే ఉన్నా ఈ డైలాగ్ అఖిల్ వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అవుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

హీరోగా సెటిల్ కాకుండానే అఖిల్ కు పెళ్లి కుదిరింది. భాగ్యనగరానికి చెందిన ఒక పారిశ్రామిక వేత్త మనవరాలిని అఖిల్ ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆ మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కూడ అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఆ ఫంక్షన్ జరిగిన కొద్ది రోజులకే వీరిద్దరి అభిప్రాయాలు మారిపోయి ఆ పెళ్లిని వద్దు అనుకున్నారు.

ఈ వ్యవహారంతో అఖిల్ మాత్రమే కాకుండా అక్కినేని కుటుంబ సభ్యులు కూడ బాగా షాక్ అవ్వడంతో కొద్ది రోజుల పాటు ఎవర్నీ కలవక పోవడం అఖిల్ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం తెలిసిన విషయాలే. ఆ షాక్ నుండి తేరుకుని అఖిల్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు. అఖిల్ లవ్ ఫెయిల్యూర్ ను జనం కూడ మర్చిపోయారు. 

అయితే ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ లో అఖిల్ నోటివెంట వచ్చిన ఆ డైలాగ్ మళ్ళీ అఖిల్ గతాన్ని గుర్తుకు చేసేలా ఉంది అంటూ ఆ డైలాగ్ చుట్టూ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో తన నుంచి విడిపోయిన అమ్మాయిని ఉద్దేశించి అఖిల్ ఈ డైలాగ్ పెట్టాడంటూ మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే మితిమీరిన అత్యుత్సాహంతో అఖిల్ ఈ డైలాగ్ ను కలకాలం గుర్తుపెట్టుకోవాలి అంటూ సలహాలు ఇస్తున్నారు. దీనితో ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ పెద్దగా యూత్ కు కనెక్ట్ అవ్వకపోయినా అఖిల్ వాడిన డైలాగ్ మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: