గత కొద్దిరోజులుగా మీడియా ముందుకు వచ్చి తన పుస్తకాన్ని ప్రమోట్ చేసుకుంటున్న   రేణుదేశాయ్ ఒకమీడియా సంస్థకు లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అకిరా నందన్ సినిమా వారసత్వం పై చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు జోష్ ను ఇస్తున్నాయి. తన కొడుకు అకిరా నందన్ రక్తంలో నటన ఉందని పవన్ కళ్యాణ్ చిరంజీవిల నట వారసత్వం కొనసాగించే చైతన్యం తన కొడుకులో కూడ కనిపిస్తోంది అంటూ రేణు చేసిన కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

అయితే జనం పైకి అకిరా నందన్ ను బలవంతంగా రుద్దడం తన అభిప్రాయం కాదనీ ప్రస్తుతం అకిరా తన చిన్నతనాన్ని ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో ఈసినిమా వారసత్వ విషయాలు అకిరా మైండ్ కు ఎక్కించి అతడిని కన్ఫ్యూజ్ చేయను అంటూ మరో ట్విస్ట్ ఇస్తోంది. భవిష్యత్ లో ఖచ్చితంగా అకిరా హీరో అవుతాడు అన్న నమ్మకం తనకుందనీ ఆ టైమ్ రావాలి అంటూ అకిరా భవిష్యత్ పై తన అంచనాలు బయటపెట్టింది రేణు.
Renu Desai
ప్రస్తుతం రైతుల సమస్య పై ఒక స్క్రిప్ట్ వ్రాసి త్వరలో దర్శకత్వం వహించబోతున్న తనకు దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడం ఇష్టం అని అంటోంది. అయితే ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ అకిరాని హీరోగా పరిచయం చేసే బాధ్యత తాను తీసుకోలేనని ఈవిషయంలో బాధ్యత తీసుకోవలసింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ పూర్తి బాధ్యత పవన్ పై పెట్టేసింది రేణు దేశాయ్. 
Image may contain: 1 person
ఇప్పటివరకు పవన్ నట వారసత్వం పై ఎప్పుడూ మాట్లాడని రేణు ఇప్పుడు ఇలా హటాత్తుగా యూటర్న్ తీసుకుని అకిరాను పవన్ నట వారసుడుగా ప్రమోట్ చేస్తున్న కామెంట్స్ వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అన్న చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు రామ్ చరణ్ చిరంజీవికి మాత్రమే కాకుండా పవన్ కు కూడ వారసుడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపద్యంలో రేణు లేటెస్ట్ గా చేసిన ఈసినీ వారసత్వం కామెంట్స్ ను ఎంత వరకు మెగా కాంపౌండ్ పట్టించుకుంటుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: