పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలమాలో పడ్డాడు, తన కారణంగా తన సినిమాను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడింది అంటూ పవన్ బాదపడుతున్నాడు. అయినా ఆయన చేసిన తప్పుకూడా లేదు.

తన సోదరుడు చిరంజీవి రాజకీయంగా తీసుకున్న అడుగు తనకు శాపం గా మారినా సరే అనుకుందాం అంటే అది తమతో సంబందంలేని ఎందరికో ఇబ్బంది పెడుతోంది అంటూ పవన్ తెగ ఫీలవుతున్నాడు అంటున్నారు. అందుకే ఏదో ఒకటి చేయాలి అన్న నిర్ణయానికి వచ్చేసాడు అంటున్నారు.

అందుకే తన ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఈ నెల 21 కి అనుకున్నారు, కాని 26కు విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు డిస్టిబ్యూటర్స్ తో, నిర్మాతతో పవన్ కూడా ఓసారి చర్చించాడట. కాని వారు వ్యక్తం చేసిన ఆందోలనలు ఆయనను మరింత డైలమాలోకి నెట్టాయంటున్నారు. ఏజరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: