వచ్చే వారం విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ జూనియర్ బాలయ్యల మధ్య నెలకొన్న సాన్నిహిత్యం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో తనకు తన తండ్రి హరికృష్ణ పాత్ర లభించడం తన అదృష్టం అంటూ జూనియర్ కు
ఈమూవీలో ఒక చిన్న పాత్ర కూడ లభించకపోవడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎదో ఒక పాత్రను బాలకృష్ణ అడిగితే జూనియర్ చేసి తీరుతాడనీ అయితే ఆతరువాత ఆవిషయం పై కూడ విమర్శలు వస్తాయని జూనియర్ లాంటి టాప్ హీరోకు ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ అలాంటి చిన్నపాత్ర ఇచ్చాడు ఏమిటి అంటూ విమర్శలు మొదలౌతాయనే అంచనాలు తమకు ఉన్న విషయాన్ని వివరించాడు. అందుకే   ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని బాలయ్య జూనియర్ ను ఈమూవీలో తప్పించాడు కానీ వారిద్దరి మధ్య ప్రేమ లేక కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కళ్యాణ్ రామ్.

దీనితో ఈవిషయాలు అన్నీ ఆలోచించుకునే బాలకృష్ణ తన తమ్ముడు చేతులు మీదుగా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ ని చేయించి జూనియర్ గౌరవాన్ని కాపాడాడు అంటూ ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన పిల్లలు అంటే తనకు చాల ఇష్టం అనీ అయితే ప్రతిరోజు తన పిల్లలను తన దగ్గరకు తీసుకుని ఐలవ్యూ తాను చెప్పను అంటూ అలాంటి బంధమే జూనియర్ బాలకృష్ణల మధ్య ఉంది అన్న విషయాలను అభిమానుల దృష్టికి తీసుకు వస్తున్నాడు.

ఇదే సందర్భంలో మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ తన చిన్నతనంలో తన తమ్ముడు జూనియర్ తో కలిసి తాను తన బాబాయ్ షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజు తన బాబాయ్ తెప్పించి ఇచ్చే చాక్లెట్ల కోసం కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళిన సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు బాలకృష్ణ జూనియర్ ల మధ్య నేలకున్న సాన్నిహిత్యాన్ని అర్ధం చేసుకోకుండా మీడియా ఊహించుకుని వార్తలు వ్రాసుకుంటూ పోతే వాటిని ఖండించవలసిన అవసరం తమకు లేదు అంటూ కళ్యాణ్ రామ్ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: