‘వినయ విధేయ రామ' విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ  ఈమూవీని దెబ్బతీయాలని మీడియాలోని ఒక ప్రముఖ వర్గం వ్యూహాత్మక వ్యూహాలు రచిస్తోంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ‘కధానాయకుడు’ విడుదల కావడం ఇప్పుడు మెగా అభిమానులలో కలవర పాటు సృష్టిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మామూలుగా ఏదైనా బాలకృష్ణ సినిమా అయితే అంతగాభయం ఉండదు కానీ ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ బయోపిక్‌ కావడంతో ‘వినయ విధేయ రామ’ పై ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకప్రముఖ రాజకీయ పార్టీ  అనుకూల మీడియా కుట్ర చేస్తుందనే అనుమానాలు మెగా ఫాన్స్‌లో రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దీనికితోడు ఈ మధ్య నాగబాబు వరసపెట్టి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ పెడుతున్న ట్విట్స్ అదేవిధంగా కామెంట్స్ ‘వినయ విధేయ రామ’ కు శాపంగా మారినా ఆశ్చర్యంలేదు అనే భయంకూడ ప్రస్తుతం మెగా అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. 
 
వాస్తవానికి  బోయపాటి శ్రీను సినిమాలకి క్రిటిక్స్‌ నుంచి సరైన రివ్యూలు రావు.  దేనికితోడు  ఓవర్సీస్‌ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులు రివ్యూలు చూసి సినిమాలకు వెళ్ళుతున్న పరిస్థితులలో ఈ సినిమాకు మీడియా వ్యతిరేక ప్రచారంకూడ తోడైయితే పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ కూడ ప్రస్తుతం మెగా అభిమానులను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.   ఎన్టీఆర్‌ బయో పిక్  క్లాసిక్‌గా పేర్కొని ‘వినయ విధేయ రామ’ ని సగటు మాస్‌ సినిమాగా కొట్టిపారేస్తే ఓవర్సీస్‌ ఏ సెంటర్స్‌లో  చరణ్ సినిమా వాషవుట్‌ అవుతుందనే ప్రచారం ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని వర్గాలవారు చేస్తున్నారు. 

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి  అనుకూలమైన వార్తా ఛానళ్లు పత్రికలు ఇటీవల ఎక్కువగా పుట్టుకొచ్చిన నేపథ్యంలో ఈ ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అన్న ఆలోచనలో మెగా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ‘రంగస్థలం’ చిత్రాన్ని కూడా యావరేజ్‌ గా పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన నేపధ్యంలో ‘వినయ విధేయ రామ’ కు పరిస్థితులు అనుకున్నంత సులువుగా లేవని మెగా అబిమానుల అభిప్రాయం..



మరింత సమాచారం తెలుసుకోండి: