తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త దర్శకులు, హీరో, హీరోయిన్లు తమ సత్తా చాటుకుంటున్నారు.  సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఆర్ఎక్స్ 100 చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకులు అజయ్ భూపతి.  ఈ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ‌, పాయల్ రాజ్ పూత్ లకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి.  తాజాగా కార్తీకేయ నటిస్తున్న ‘హిప్పీ’కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
Image result for కార్తికేయ హిప్పి పోస్టర్స్
ఆర్ఎక్స్ 100 చిత్రం బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్యువ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది.  హిప్పి చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 
Image result for kartikeya hippi movie
ఈ చిత్రంలో కార్తికేయ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న ముంబై భామ‌లు దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ లని క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో ఇద్ద‌రు భామ‌ల‌తో క‌లిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు కార్తికేయ‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: