బాలీవుడ్ లో ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచే నటి కంగనా రౌనత్  ప్రధాన పాత్రధారిగా హిందీలో 'మణికర్ణిక' సినిమా రూపొందింది.   ఈ సినిమాకి కథా కథనాలను విజయేంద్ర ప్రసాద్ అందించారు.  ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు.  దాదాపు డెబ్బై శాతం పూర్తయిన తర్వాత అనూహ్యంగా తెలుగులో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో ‘మణికర్ణ’ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.  ఆ తర్వాత మణికర్ణిక సినిమా దర్శకత్వ బాధ్యతలు నటి కంగనా తీసుకుంది.


ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమైంది. ఆ మద్య హిందీ వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి  అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి నుంచి ఈ మూవీ విషయంలో ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.  బ్రిటీష్‌ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ సినిమా పూర్తి చేయడానికి కంగనా రనౌత్ కూడా అంతే కష్టపడ్డారాని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.  తాజాగా తెలుగులోను ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్‌లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు.


సాహసవంతురాలైన యువతిగా.. మహారాణిగా .. మాతృమూర్తిగా .. మహా యోధురాలిగా ఈ ట్రైలర్లో కంగనా కనిపిస్తోంది. 'ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను'. 'ఝాన్సీ మీకూ కావాలి .. నాకూ కావాలి. మీకు రాజ్యాధికారం కోసం కావాలి .. నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి' అనే డైలాగ్స్ బాగున్నాయి. 


మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్ లో పోరాట సన్నివేశాల్లో కూడా కంగనా తన దూకుడును ప్రదర్శించారు. ఈ సినిమాను, హిందీతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: