సంక్రాంతి అంటేనే కుటుంబం. అలాంటి ఇలాంటి కుటుంబం కాదు, అతి పెద్ద కుటుంబం. అత్తా, మామ, మరదళ్ళు, తోడల్లుళ్ళు, బావ మరుదులు, వదినలు, ఆడపడుచులు, చిన్నారులు ఇలా అన్ని రకాల వయసుల వారితో నవరభరితమైన జీవన రాగం సంక్రాంతి లోగుళ్ళు. మరి మూడు రోజుల పెద్ద పండుగ అది. ఈ పండుగకు అంతా వస్తారు, కలసి మెలసి మెలుగుతారు. విందులు ఉంటాయి. అటువంటి వారికి వినోదాలు కూడా కావాలి కదా. అందువల్ల వారందరి కోసమే సంక్రాంతి సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు వారిని సందడి చేయడానికి ఒకటి కాదు, ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. వాటిలొ మేటిగా ‘ఎన్టీఆర్ పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.


అందులో తొట్టతొలిగా వస్తున్న మూవీ అన్న గారి జీవిత చరిత్రలో తీస్తున్న సినిమా ‘ఎన్టీఆర్  కధానాయకుడు. ఈ మూవీని నటిస్తూ తొలిసారిగా నిర్మించాడు ఆయన తనయుడు బాలక్రిష్ణ. ఈ మూవీని ఎంబీకే బ్యానర్ ద్వారా బాలయ్య తీశాడు. ఈ మూవీ తాజాగా సెన్సార్ కూడా చేసుకుని ఈ నెల 9వ్ విడుదలకు సిధ్ధంగా ఉంది. ఎటువంటి కటింగులూ లేకుండా ఈ మూవీకి క్లీన్ సర్టిఫిఏట్ ఇచ్చారు. ఈ మూవీ బాగుందని అపుడే టాక్ వస్తోంది. మరి విశేషాలు చాలానే ఉన్నాయని కూడా అంటున్నారు.


ఈ సినిమా పూర్తిగా కుటుంబ విలువలను చెప్పే కధా చిత్రమని తెలుస్తోంది. ఈ మూవీలో అన్న గారి నిజ జీవితంలో ఆయనకున్న బంధాలు, ఎమోషన్లనే కధగా చేసుకుని మలచారు. నందమూరి జీవితంలో బసవ రామ తారకం పాత్ర ఏంటన్నదే ఈ చిత్రమని తెలుస్తోంది. అన్న గారి జీవితంలో ప్రవేశించినది లగాయితు చివరి వరకూ ఆమె ఆయన వెన్నటి ఉంటూ చేదోడు వాదోడుగా చేసిన సేవలు, వారిద్దరి అనురాగం, ఆయన విజయాల వెనక ఆమె పాత్ర, ధర్మపత్నిగా ఆమె నిర్వహించిన గొప్ప పాత్ర ఏంటన్నదే ఈ చిత్రంలో చూపుతున్నారు.
గా చూసినా అన్న గారి మూవీ గొప్ప కుటుంబ కధా చిత్రంగా ఉంటుందని అంటున్నారు. అన్న గారిగా బాలయ్య ఒదిగిన తీరు, ఆయన్ని అల మలచిన క్రిష్, ఇక బసవరామ తారకం గా విద్యాబాలన్ చేసిన నటన ఈ చిత్రానికి అసెట్ అని అంటున్నారు. కధానాయకుడిగా అన్న గారు వేసిన వివిధ పాత్రలు కూడా ఈ సినిమాలో కనువిందు చేస్తాయని చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి షడ్రసోపేతమైన భోజనంగా ఈ సినిమా వుంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: