నిన్న ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ కు సెన్సార్ క్లియరెన్స్ లభించి ఆసినిమాకు క్లీన్ సర్టిఫికేట్ లభించింది. ఒక్క సింగిల్ కట్ కూడ లేకుండా ఈమూవీని సెన్సార్ క్లియర్ చేసింది. దీనితో మరో నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రకంపనలు మొదలు కాబోతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ నిర్మాతలు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ నిర్మాత దానయ్య తెలంగాణ ప్రభుత్వంతో చేస్తున్న రాయబారాల పై ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి మొదటిరోజు రెగ్యులర్ షోలు మొదలు కాకుండానే ప్రీమియర్ షోలు అర్దరాత్రి నుండి వెయ్యడం ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.

గతంలో తెలంగాణాలో కూడ టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఇలాంటి ప్రీమియర్ షోల హడావిడి జరిగేది. టాప్ హీరోల సినిమాల పై ఉన్న మోజుతో ఒకొక్క టిక్కెట్ మూడువేల రూపాయల వరకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు శాఖ ఇలాంటి ప్రీమియర్ షోలను అర్దరాత్రి షోలను అదేవిధంగా కొద్దిరోజుల పాటు కొనసాగించే స్పెషల్ షోలను ఎలాంటి టాప్ హీరోల సినిమాలకు అయినా అంగీకరించడం లేదు. 
అయితే నిర్మాత దానయ్య రామ్ చరణ్ కు మంత్రి కెటిఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని ‘వినయ విధేయ రామ’ కోసం స్పెషల్ షోలను వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇలాంటి స్పెషల్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు కూడ చరణ్ సినిమాకు మినహాయింపు ఇస్తే అదే తరహ మినహాయింపు తమకు కూడ ఇమ్మని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్. దీనితో మంత్రి కెటిఆర్ తన మిత్రుడు చరణ్ కోసం రూల్స్ లో మార్పులు చేస్తారా లేకుంటే నిబంధనలు చట్టాలు అందరికీ ఒక్కటే అన్న సంకేతాలు ఇస్తూ దానయ్య ప్రయత్నాలకు స్పందించకుండా ఉంటారా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: