ఈ మధ్య నాగబాబు సినీ నటుడు అయినబాలకృష్ణ ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తున్నాము. అయితే ఈ టార్గెట్ పొలిటికల్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఎదో బాలకృష్ణ అన్నాడని ఇప్పుడు నాగబాబు మేల్కొని అతి చేయడం అభిమానులకు కూడా నచ్చడం లేదంటా .. మొదట్లో అభిమానులు, నాగబాబు.. బాలయ్య మీద చేసిన కామెంట్స్‌తో పండగ చేసుకున్నారు.

Image result for nagababu

ఆ తర్వాత నాగబాబు అసలు ఉద్దేశ్యం వారికి అర్థమయ్యింది. అంతే, 'వద్దు బాబూ నాగబాబూ..' అంటూ సోషల్‌ మీడియాలోనే మొరపెట్టుకుంటోన్న పరిస్థితి ఏర్పడిందిప్పుడు. 'మీ ఓవరాక్షన్‌ అంతా జనసేన పార్టీలో యాక్టివ్‌ అవడానికే కదా.? దయచేసి ఈ రచ్చ ఆపెయ్యండి. జనసేన పట్ల కాస్తో కూస్తోన్న ప్రజల్లో వున్న గుడ్‌ విల్‌, మీ కారణంగా పోయే ప్రమాదముంది. కుటుంబమంతా మళ్ళీ ఒక్కటై.. జనసేనను కుటుంబ పార్టీగా మార్చెయ్యొద్దు.

నాగబాబు 'అతి'.. అభిమానులకే నచ్చట్లేదు

గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీరంతా కలిసి ఏం చేశారో చూశాం..' అంటూ సుదీర్ఘంగా అభిమానులు, నాగబాబుకి వివరణతో కూడిన విజ్ఞప్తి చేస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ, సోషల్‌ మీడియాలో 'అతి' చేశాడంటే అర్థముంది.. శ్రీరెడ్డి చేసిందన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ, నాగబాబు కూడా అదే చేస్తే ఎలా.? చిరంజీవి సోదరుడిగా, నటుడిగా, నిర్మాతగా నాగబాబు తనకున్న డిగ్నిటీని.. 'అభిమానుల్ని రెచ్చగొట్టి పండగ చేసుకోవాలనే క్రమంలో' కోల్పోతుండడం ఆశ్చర్యకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి: