సంక్రాంతి దగ్గర పడుతూ ఉండటంతో సంక్రాంతి పండుగ సినిమాల వేడి   రాజుకుంటోంది.  దీనికితోడు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలు అన్నింటి పై భారీ అంచనాలు ఉండటంతో ఎవరికి వారు వారి సినిమాల    ఓపెనింగ్స్ విషయంలో అందరూ ధీమాగానే ఉన్నారు. అయితే ఈ రేస్ లో  మాస్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్  చేస్తూ రాబోతున్న ‘ఎఫ్ 2’ కొంత వరకు వెనకబడింది అని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ‘ఎఫ్ 2’ లో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తూ ఉన్నపటికీ  మెగా  ఫ్యాన్స్ ఫోకస్ పూర్తిగా ‘వినయ విధేయ రామ’ మీదే ఉంది. అంచనాలకు అనుగుణంగా చరణ్ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మెగా అభిమానులు ‘ఎఫ్ 2’ గురించి పట్టించుకోరు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందింపబడ్డ ‘ఎఫ్ 2’ లో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో ఈమూవీని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి.  

దీనికితోడు వెంకటేష్  ముందు 10 సినిమాల అనుభవం కూడా లేని వరుణ్ తేజ్ నటనలో నిలబడ లేకపోయాడు అంటూ ఈమూవీ ఫస్ట్ కాపీ చూసిన వారు అభిప్రయా పడుతున్నట్లు టాక్.  అదేవిధంగా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ క్యూటీ మెహ్రీన్ అందాలతో పాటు అనిల్ రావిపూడి జోడించిన మసాలాల మధ్య వరుణ్ తేజ్ తన ఉనికిని చాటుకోవడంకష్టంగా మారింది అని అంటున్నారు. 

ఒకవేళ ‘ఎఫ్ 2’ హిట్టు కొట్టినా దాని క్రెడిట్ లో అధికశాతం వెంకటేష్ ఆతర్వాత అనిల్ రావిపూడికి దక్కుతుంది కాని ఈమూవీ వల్ల వరుణ్ తేజ్ కు కలిసి వచ్చే క్రేజ్ ఏమి ఉండదు అంటూ ఈమూవీ విడుదల కాకుండానే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ‘అంతరిక్షం’ ఫ్లాప్ తో అయోమయంలో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఈ కామెంట్స్ విని ఆశ్చర్యపోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: