సూపర్ స్టార్ రజినికాంత్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ ముందు నానా హంగామా చేసింది. అయితే రిలీజ్ తర్వాత మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని మొదటి షోతోనే అర్ధమైంది.


తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ స్థాయిలో రిలీజైన 2.ఓ సినిమా తమిళంలో 100 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవగా అక్కడ ఫుల్ రన్ లో 60 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే అక్కడ ఎలా లేదన్నా 40 శాతం లాస్ అన్నమాట. ఇక తెలుగులో కూడా దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ కలిసి 2.ఓని 72 కోట్లకు కొన్నారు. 


తెలుగులో కూడా 55 కోట్లను మాత్రమే రాబట్టింది ఈ సినిమా. అయితే తమిళంతో పోల్చుకుంటే తెలుగులోనే ఈ సినిమా ఎబో యావరేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక హిందిలో మాత్రం 2.ఓ హిట్ ప్రాజెక్ట్ అన్నట్టే లెక్కకట్టొచ్చు. కరణ్ జోహార్ రిలీజ్ చేసిన 2.ఓ హిందిలో 100 కోట్లకు అమ్ముడవగా 200 కోట్ల గ్రాస్ తెచ్చింది.


అంటే ఒక్క హిందిలో తప్ప 2.ఓ ఎక్కడ సేఫ్ ప్రాజెక్ట్ అవలేదు. లైకా ప్రొడక్షన్స్ లో వచ్చిన 2.ఓ సినిమా రజినితో పాటుగా అక్షయ్ కుమార్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ ప్రతినాయకుడిగా నటించాడు. హిందిలో సినిమా బాగా ఆడేందుకు అక్షయ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఫైనల్ గా 2.ఓ హిందిలో తప్ప అన్నిచోట్ల లాసులు తెచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: