మెగస్టార్ చిరంజీవి అంటే వెండి తెరకు పులకరిస్తుంది. తనదైన నటనతో కనకవర్షాలు కురిపించిన మెగాధీరుడాయన. నటనకే కొత్త అర్ధాలు చెప్పి డ్యాన్సులు, ఫైట్లకు వేగం ఏంటో రుచి చూపించిన ఘనుడాయన. ఆయన రంగు పూసుకుంటే చాలు తెలుగు సినీ కళామతల్లికి పన్నీటి జల్లే కురుస్తుంది. ఆయన తెర మీద కనిపించి కనువిందు చేస్తే ఆడియన్స్ తో పాటు  వెండి తెర సైతం సగర్వంగా నవ్వులు చిందిస్తుంది. అటువంటి అద్భుత కళాకారుడు చిరంజీవి.


చిరంజీవి ప్రస్తుతం సీరా నరసిమ్హారెడ్డి అన్న మూవీలో బిజీగా ఉన్నారు. దీని తరువాత కూడా ఆయన మరికొన్ని మూవీలను రెడీగా లైన్లో పెట్టేశారు. వెంటనే కొరటాల శివతో సినిమా ఉంటుందని కూడా చెబుతూంటే, త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్లో మరో మూవీకి కూడా చిరు స్వయంగా ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించారు. మరి ఇంతటి బిజీలో ఉన్న మెగా స్టార్ కాస్తా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారని అంటున్నారు. అదేంటంటే...


ఆయన మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తారని, తనదైన మ్యానరిజంతో నట్టింటి ప్రేక్షకులను మరో మారు రంజింపచేతారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ త్రే లో హోస్ట్ గా చిరంజీవి కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఏడాది  నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ప్ర‌సార‌మైన బిగ్ బాస్ సీజన్ 2   తెలుగుప్రేక్షకులని ఎంతగానో అలరించింది.   కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు.   గణేష్, నూతన్ నాయుడు లాంటి సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ 2తో సెలెబ్రిటీలుగా మారిపోయి. ఇప్పుడు స‌మాజంలో అనేక కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులు కూడా అయ్యారు.   


బిగ్ బాస్ సీజన్ 3 ని 2019లో ఆరంభించేందుకు య‌త్నాలు చేస్తున్న  నిర్వాహ‌కులు . హోస్ట్ గా  విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరిగుతోంది. అయితే  తాజాగా  మెగాస్టార్ చిరంజీవి వైపు కూడా దృష్టిసారించార‌ట‌. గ‌తంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా చిరంజీవి వ్యవహరించిన విష‌యం విదిత‌మే.  మరి చిరు కనుక ఒకే అంటే మాత్రం బాస్ ఈజ్ బాక్ అని అభిమానులే కాదు యావత్తూ తెలుగు జనం అనుకుంటారని కచ్చితంగా చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: