ఓ వైపు భారత దేశ వ్యాప్తంగా ‘మీ టూ ’ఉద్యమం కొనసాగుతుంది.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.  ఆ తర్వాత పలువురు సినీ తారలు, ఇతర విభాగాలకు సంబంధించిన వారు సైతం గతంలో తమపట్ల లైంగిక వేధింపులకు గురి చేసిన వారి వివరాలు వెల్లుబుచ్చారు.  దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి తనతో ప్రముఖ సినీ రచయిత వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించారని..ఆయన వ్యక్తిత్వం మంచిది కాదని తెలిపింది.

ఆ తర్వాత పలువురు సినీ నటులు ఈ విషయంపై రక రకాల చర్చలు కొనసాగించారు.  ఇక టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఉద్యమమే చేపట్టింది.  సినీ పరిశ్రమలోకి రావాలనుకునే అమ్మాయిలను కొంతమంది దళారు..సినీ పెద్దలు దారుణంగా మోసం చేస్తూ వారి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారని..ఇలా ఎంతో మంది అమ్మయిలు తమ మోసపోతున్నారని..అలాంటి వారిలో తాను కూడా ఒక యువతి అని చెప్పింది.  అయితే అనుకోకుండా శ్రీరెడ్డి ఉద్యమంలో విఘాతం కలగడంతో ఆమె ప్రస్తుతం చెన్నైకి మాకాం మార్చింది.

అక్కడ నుంచి సోషల్ మీడియాలో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తుంది. తాజాగా మరో కాస్టింగ్ కౌచ్ మళియాళ చిత్ర పరిశ్రమలో జరిగింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత వైశాక్ రాజన్‌పై ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఓ మోడల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. వివరాలను పరిశీలిస్తే,మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన సినీ నటి ఒకరు సినీ అవకాశాల కోసం ఓ నిర్మాత వైశాక్ రాజన్‌ను సంప్రదించింది. ఈమెను 2017లో ఆ నిర్మాత ఎర్నాకుళంలోని కత్రికదావులో ఉన్న ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి తన కామవాంఛ తీర్చుకున్నాడు.

అయితే ఆమెకు సినిమా ఛాన్సులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పపడటంతో ఆ మోడల్.. నిర్మాతపై ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిర్మాత వద్ద విచారణ జరుపుతున్నారు. కాగా, కాగా, నిర్మాత వైశాక్.. తన పేరుమీదే అంటే వైశాక సినిమా పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయన గత 2012 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఈయన 'రోల్ మోడల్స్', 'ఛంక్జ్', 'వెల్కమ్ టు సెంట్రల్ జైల్', 'పద్మశ్రీ భారత్ డాక్టర్ సరోజ్ కుమార్' వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఈయన చివరగా 'జానీ జానీ యస్ అప్పా' అనే చిత్రాన్ని తీశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: