సంక్రాంతి అంటేనే అదో పెద్ద సందడి,దాన్ని రెట్టింపు చేయడానికి పెద్ద సినిమాలు తోరణంలా వచ్చేస్తున్నాయి. 9న బాలయ్య మూవీ ఎంటీయార్ కధానాయకుడు రిలీజ్ అవుతూంటే, 10న రజనీకాంత్ పెట్టా,  11న వినయవిధేయ రామ, 12న ఎఫ్ 2 ఇలా వర‌సగా మూవీస్ వచ్చిపడుతున్నాయి. ఈ మూవీస్ లో  మాస్ ఎంటర్ టైనర్ గా వినయ విధేయ రామాకు బాగా కలసి వస్తుందని అంటున్నారు.


దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాస్ తో కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తీసి సక్సెస్ కొట్టారు, ఆయన చరణ్ తొలి కాంబో, అలాగే చరణ్ ప్రీవియస్ మూవీ రంగస్థలం బ్లాక్ బస్టర్ మూవీ కావడం, ఇవన్నీ ఒక్కసారిగా సినిమాకు పాజిటివ్ బజ్ ని పెంచేస్తున్నాయి. ఇక థియేటర్లు కూడా ఎక్కువగా చరణ్ మూవీక పడ్డాయని తెలుస్తోంది. దాంతో చరణ్ మూవీకి బీభత్సంగా కలెక్షన్ల పంట పండుతుందని భావిస్తున్నారు.


మరి సంక్రాంతికి కుమ్ముడు అంటూ చరణ్ వినయ విధేయ రామ తో రెచ్చిపోతారని అంటున్నారు. మిగిలిన మూవీస్ ని తీసుకుంటే కూడా ఈ మూవీకే ఎగ్జిబిటర్లు ఓటు వేస్తున్నారని అంటున్నారు. మాస్ మసాలా మూవీగా తెరకెక్కడం, చరణ్ పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో పెద్ద మొత్తానికే బయ్యర్లు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇక బాలయ్య మూవీతో పాటు, వెంకీ, వరుణ్ ఎఫ్ 2 రేసులో ఉన్నా వాటి సక్సెస్ బట్టి థియేటర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం ఎక్కువ తెరలపై వినయ విధేయ రామా వే కనిపిస్తోంది. మొత్తానికి మెగా వారసుడిగా చరణ్ దున్నేశాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: